10-08-2025 10:22:35 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు కాడిగళ్ల రాములమ్మ, రాపోలు నర్సింహా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు కెసిరెడ్డి నీరజ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కెసిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డిలు మానవత దృక్పథంతో బియ్యం, నిత్యావసర సరుకులు, ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.