10-08-2025 10:16:18 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డినీ వెంకటాపురం గ్రామానికి చెందిన యువకులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో, దాతల సహకారంతో చైర్మన్ నరేష్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇది అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు వాకిటి అనంత రెడ్డి మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు.