calender_icon.png 29 September, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలి

29-09-2025 01:13:59 AM

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ

ముషీరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రాన్ని, రాజ్యాంగ వ్యవస్థలపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరగూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ బీసీ ల రిజర్వేషన్లకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించి ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించా ల్సిందేనని అన్నారు.

42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 9పైన ఓసీలు కోర్టుకు వెళ్ళడం జరిగిందని, దీన్ని అధిగమించాలని, అవనరమైతే గవర్న ర్, కేంద్ర ప్రభుత్వాలను నిలదీయాలని సూచించారు. విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడువుకోవాలని చూస్తే బిసిలు తగిన గుణపాఠం చెవుతారని హెచ్చరించారు. తమిళనాడు తరహలో బిసిలకు చట్టబద్దమైన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ  నాయకులు, న్యాయవాదులు  నాగుల శ్రీనివాస్ యాదవ్, జక్కుల వంశీకృష్ణ, అరుణ్ యాదవ్, నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.