29-09-2025 01:15:08 AM
బెల్లంపల్లి అర్బన్, సెప్టెంబర్ 28 : జీరో బ్యాలెన్స్ చెక్ ఇచ్చి మోసం చేసిన వారిని చెక్ బౌన్స్ చీటర్స్ అంటారు. రాజకీయాల్లో హామీలు, ఇచ్చి తప్పిన వారిని రాజకీయ మోసకారులు అంటారు. నమ్మకాన్నీ నిలబెట్టుకోవడానికి లిఖితపూర్వకంగా బాండ్ రూపేనా రాసిచ్చిన హామీని నిలబెట్టుకోని బెల్లంపల్లి ఎమ్మెల్యేను స్థానిక ప్రజలు బాండ్ బౌన్సర్‌గా చర్చించుకోవడం ఆసక్తిగా మారిం ది. మాటకు మతి లేదు, పూటకు గతి లేదు..,
సామెతను కాస్త అటు ఇటుగా మార్చుకొని మాటకు మతిలేదు పూటకు కుబేరుడుగా మార్చుకుంటే ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు చక్కగా వర్తిస్తుంది. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు, ప్రత్యేకంగా ప్రజలకు హామీగా రాసిచ్చిన బాండ్ పై తాజాగా వాడి వేడిగా చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే తమకు అందుబాటులో ఉండి తమ ఆలనా పాలనా తోపాటు అభివృద్ధిని చూడలనుకోవడం ప్రజల సహజవాంచ.
కానీ బెల్లంపల్లి ఎమ్మెల్యే తీరు చూస్తే అది ప్రజల తీరని కోరికగానే మిగిలిపోనున్నదా..? అనే చర్చ రాజకీ య విశ్లేషకుల్లో మొదలైంది. స్థానికంగా ఎమ్మె ల్యే ఉంటారనేది ప్రజలది అత్యాశగానే మిగిలిపోనున్నది.
ఎందుకంటే ఎమ్మెల్యే గెలి చి రెండు సంవత్సరాలు దాటుతున్న ఆయన పరిపాలన, దక్షత తీరులో ఎలాంటి మార్పు లేదు. 2023లో ఎన్నికల్లో ప్రజలు ఎంతో ఆశతో గడ్డం వినోద్ ను గెలిపించారు. రెండు పర్యాయాలు గెలిపించిన బీఆర్‌ఎస్ దుర్గం చిన్నయ్యను ఆ ఎన్నికల్లో ఇంటికి పంపించారు. ఆయన స్థానంలో గడ్డం వినోద్ ను అధికార పీఠంమెక్కించారు.
ఎన్నికల ముందు హామీలు..
ఎన్నికల ముందు ప్రజలకి హామీలు ఇవ్వ డం పోటీలో ఉన్న ఎవరైనా చేస్తారు. గెలుపొందిన ఎమ్మెల్యే అట్టి హామీలో కొన్ని టినైనా నిలబెట్టుకొవడం ప్రజాప్రతినిధి లక్ష ణం. ఎన్నికల ముందు ఎమ్మెల్యే గడ్డం వినో ద్ స్థానికంగా ఉంటానని, అంతే కాకుండా బెల్లంపల్లిలోనే సొంతిల్లు కట్టుకునీ ఉంటాననీ ప్రజల సమక్షంలో మరీ బాండ్ రాసి ఇచ్చాడు. ఈ ఎన్నికల్లో స్థానికతపై బెల్లంపల్లి నియోజకవర్గంలో రెండు వాదనలు ప్రబలంగా వినిపించాయి.
ఒకటి గడ్డం వినోద్ స్థానికేత్రుడని, స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని బలమైన వాదనలు సొంత పార్టీలో వినిపించాయి. కానీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారే రంగంలో దిగడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. కాగా ఈ నేపథ్యంలో స్థానికత సమస్యను అధిగమించేందుకు బెల్లంపల్లిలోనే స్థిరంగా ఉంటానని బాండ్ రాసిచ్చారు. అలా ప్రతికూల వాదనలను తిప్పికొట్టారు.
అంతే కాకుండా సొంతంగా ఇల్లు కట్టుకొని ఇక్కడే ప్రజలకు తన సేవలను అంకితం చేస్తానని ప్రతినబూనారు. ఇలాంటి పరిస్థితుల్లో గడ్డం వినోద్ ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవడానికి బాండ్ రాసి ఇవ్వాల్సివచ్చింది.ఆ ఎన్నికల్లో ప్రజలకు హామీ పడిన బాండ్ వెనుక ఇంతటి కథ ఉంది.
రెండేళ్లయిన మారని తీరు...
బెల్లంపల్లి ఎమ్మెల్యే గెలుపొంది రెండు సంవత్సరాలు దాటింది. ఆయన పరిపాలన పనితీరులో ముఖ్యంగా అభివృద్ధి బెల్లంపల్లిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అనే చందంగా ఉండిందని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదు నుంచి అప్పుడప్పుడూ చుట్టూ చూపుగా బెల్లంపల్లి కి వచ్చి నాలుగు రోజులు హడావిడి చేసి తిరిగి మళ్లీ హైదరాబాద్ కు వెళ్తారు. ఇది గత రెండున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వ్యవ హరిస్తున్నతీరు అందరికీ వి విధితమే.
ఇచ్చిన హామీలు...
2023 ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఇట్టే ఉండిపోయాయి. ప్రధానంగా బెల్లంపల్లి పాలిటెక్నిక్ ను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్, బస్సు డిపో తోపాటు ముఖ్యంగా బెల్లంపల్లి నియోజవర్గం రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. ఇలా ఇచ్చిన హామీల్లో అభివృద్ధి అంశాలను పక్కన పెడితే..స్థానికత సమస్యనే ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.
రెండున్నర ఏళ్లలోనే అయినకీ నియోజకవర్గ అభివృద్ధి పై ఎలాంటి అభివృద్ధి నమూనా ప్రణాళిక లేదన్న అసంతృప్తి మాత్రం ప్రతి ఒక్కరీలో వ్యక్తం అవుతున్నది. గతంలో ప్రాతినిధ్యo వహించిన ఎమ్మెల్యేలు స్థానికులు అయినప్పటికీ గొప్ప అభివృద్ధి పనులు చేసినవి ఏమీ లేవు. కానీ స్థానికంగా లేరని సమస్య మాత్రం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మాత్రం పెను గండం గా మారింది. స్థానికంగా ఉన్న లేకున్నా..
గత ఎమ్మెల్యేల పనితీరుకు భిన్నంగా అభివృద్ధిలో బెల్లంపల్లి నియోజక వర్గాన్ని ముందు వరుసలో నిలబెడితే స్థానికత కి ఆస్కారం ఉండే ఉండేదే కాదు. బెల్లంపల్లి అభివృద్ధి పై తన ముద్ర లేకుండా పోవడమే ఆయనకో పెద్ద మైనస్ గా మారింది. స్థానికంగా ఉన్నా లేకున్నా అభివృద్ధి చేస్తాడనే నమ్మకమే ఆయనను గెలిపించింది. ఈ కోణంలోనే ప్రజలు ఆలోచించి అటు కాంగ్రెస్లో ఒక వర్గం, ఇటు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్య గడ్డం వినోద్ పై స్థానికతను ప్రధాన అస్త్రంగా దాడి చేశారు.
ప్రజలు ఆ విమర్శలను విశ్వసించలేదు. అభివృద్ధినే ఆకాంక్షించారు. అందుకే ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు పట్టం కట్టారు. ఈ సత్యాన్ని ఇప్పటికైనా గడ్డం వినోద్ మర్చిపోకూడదు. పేరు గొప్ప ఊరు దిబ్బ చందం నుంచి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బయటపడేందుకు తన పనితీరును సంక్షించుకోవాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.