calender_icon.png 15 July, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండాల్లో వైభవంగా ప్రారంభమైన తీజ్ ఉత్సవాలు..

14-07-2025 10:09:49 PM

బాన్సువాడ (విజయక్రాంతి): నసురుల్లాబాద్ మండలంలోని సంగం తండాలో వైభవంగా ప్రారంభమైన బంజారా తీజ్ ఉత్సవాలు(Banjara Teej celebrations) ఈ సందర్భంగా తండా నాయకులు మాట్లాడుతూ.. బంజారా అంటేనే ప్రకృతిని ప్రేమించే ప్రకృతితో మమేకమై ఎంతో పవిత్రంగా 9 రోజులు పాటు పెండ్లి కానీ అమ్మాయిలు నియమ నిష్ఠలతో తమకు జీవితంలో మంచి భర్త రావాలని అలాగే పశుపోషణ పాడి పంటలు సుభిక్షంగా పండాలి అని నిర్వహిస్తారు.

ఈ తీజ్ పండుగను మొదటిరోజు అడవికి వెళ్లి పుట్టమన్నును తీసుకువచ్చి దాన్ని జల్లెడ పట్టి దూసేరు తీగతో తయారు చేసిన బుట్టలో పుట్టమన్ను నింపి నానబెట్టిన గోధుమలను అందులో వేసి ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉంటూ మూడు పూటలు అమ్మాయిలు నీళ్ళు పోస్తూ రాత్రి వేళల్లో తండా మొత్తం కలిసి సాంస్కృతిక సాంప్రదాయాల్లో నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఇలా తొమ్మిది రోజులు పాటు సాగి తొమ్మిదవ రోజు తండా మొత్తం భవాని మాతకు మేకలను బలిసి నిమర్జనానికి తయారుచేస్తారు. ఈ విధంగా ఎంతో పవిత్రంగా సాగిన ఈ తీజ్ పండుగ రాబోయే తరాలకు తమ సాంస్కృతి సాంప్రదాయాలను అందించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు/ ఈ కార్యక్రమంలో తండా నాయకుడు దూప్ సింగ్ కరోబరి భూపతి ఆలయ పూజారి ఫుల్ సింగ్ మహరాజ్,జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్,మాజీ ఎంపీపీ విట్టల్,పాకిరా నాయక్,సంగ్య కరొబారి, చందర్ నాయక్,శ్రీచంద్ కరొబారి పాల్గొన్నారు.