calender_icon.png 23 May, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

23-05-2025 12:00:00 AM

  1. జయంతి ఉత్సవాలకు 3 లక్షల మంది హాజరు
  2. ఘనంగా హనుమాన్ జయంతి

జగిత్యాల, మే 22: తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొండగట్టులో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గత 3 రోజులుగా కొండగట్టు అంజన్న సన్నిధిలో శాస్త్రీయంగా జరుగుతున్న పెద్ద హనుమాన్ జ యంతి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

వేడుకల సందర్భంగా సుమారు 3 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారని అధికాల అంచనా. సరిగ్గా 41 రోజుల క్రితం చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ మాల వేసుకొని, దీక్ష తీసుకున్న స్వాములు ఈ పెద్ద హనుమాన్ జయం  తితో తమ దీక్షను ముగిస్తారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో దీక్ష మాల విరమణకు స్వాములకు గ ంటలకొద్ది సమయం పట్టింది.

భక్తుల సంఖ్యకు అనుగుణంగా దేవస్థానం ఆధ్వర్య ంలో ఫ్రీ బస్, క్యూలైన్ తదితర వసతులు కల్పించారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి వ చ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకున్నారు.