calender_icon.png 29 September, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నదులను కాపాడుకోవాలి: వేదకుమార్

29-09-2025 01:00:28 AM

ముషీరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్(ఎఫ్.బీ.హెచ్) అధ్యక్షులు ప్రొ.మణి కొండ వేదకుమార్ అన్నారు. అంతర్జాతీయ నదుల దినోత్సవం సందర్భంగా ఎఫ్.బీ. హెచ్ ఆధ్వర్యంలో ఆదివారం కొత్త తెలంగాణ చరిత్ర బృందం, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ గవర్నమెంట్ సిటీ కాలేజీతో పాటుగా ఏడుపాయల దగ్గర మంజీరా నది ని బృంద సభ్యులు వీక్షించి నదితో నడక కార్యక్రమన్ని ప్రారంభించారు.

ఈ సందర్బం గా వేదకుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 100 దేశాల్లో జరుపుతున్న ఈ నదుల దినోత్సవాన్ని ఈ సంవత్సరానికి మెదక్ జిల్లాలోని ఏడుపాయల వద్ద మంజీరా నది సమక్షంలో జరిపినట్లు తెలిపారు. గ్రూప్-1 ఆఫీసర్ కరిపే రాజు, ఫోరం సభ్యుడు వేణుగోపాల్, నీటి నిల్వ పద్ధతుల ఎక్స్ పర్ట్ సుభాష్, సూపరింటెండెంట్  ఆఫ్ ఇంజనీర్ ఎం. వెంకటేశ్వర్లు, అంబటి వెంకన్న, బుర్ర సంతోష్, ఎఫ్.బీ.హె చ్ వైస్ ప్రెసిడెంట్ ఎం.హెచ్.రావు, మేనేజర్ ఖైజర్, డా.రమా, డా.పద్మ పాల్గొన్నారు.