calender_icon.png 29 December, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిమడ్ల గ్రామంలో చిరుత సంచారం

29-12-2025 01:58:18 AM

గొర్రెల మందపై దాడి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన 

కోనరావుపేట, డిసెంబర్ 28 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం మరిమడ్ల గ్రామంలో చిరుతపులి జాడ కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి సమయంలో గ్రామ శివార్లలో ఉన్న గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఒక మేకను తీవ్రంగా గాయపరిచగా మరో మేకను అడవిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. గొర్రెల కాపరులు అప్రమత్తమై కేకలు వేయడంతో చిరుత నుంచి పారిపోయింది. గొర్రెల మందపై జరిగింది చిరుత దాడేనని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయిఫ్ ఖాన్ ధృవీకరించారు. అటవీ ప్రాం తానికి సమీపంలో ఉన్న గ్రామం కావడంతో వన్యప్రాణులు గ్రామ పొలిమేరల్లోకి వచ్చే అవకాశం ఉందని, ప్రజలు ముఖ్యంగా గొర్రె ల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ఆయ న సూచించారు. చిరుత దాడితో మరిమడ్ల గ్రామస్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు.