calender_icon.png 13 August, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు కొనసాగిద్దాం

13-08-2025 12:00:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 12, (విజయక్రాంతి):నాడు భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్ అని, నేడు విద్యారంగా సమస్యల పరిష్కారానికి సమ స్యల పోరాటాలు నిర్వహించేది తమ సంఘమేనని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి అజిత్ అన్నారు. మంగళవారం ఏఐఎస్‌ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల  ప్రాంగణం లో ఏఐఎస్‌ఎఫ్  90 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించా రు.

ముఖ్య అతిథిగా ఏఐఎస్‌ఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి S. K ఫహీమ్ దాదా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ హాజరయి శ్వేతా అరుణ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూస్వాతంత్య్రం రాకపూర్వమే దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సం ఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్, ఆజాద్ వీరుల ఆశయ సాధన కోసం బబృద్దీన్ బాసు, ప్రేమ్ నారాయణ భార్గవ్ ల నాయకత్వాన 1936 ఆగస్టు12 న అఖిల భారత విద్యార్ధి సమాఖ్య ఆవిర్భవించింద నీ తెలిపారు.

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల బానిసచేర నుంచి మాతృభూమి విముక్తి కై సాగిన వీరోచిత స్వాతంత్య్ర ఉద్యమంలో పొ త్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్య్రము మా జన్మ హక్కు అని మా అంతం చూసిన - స్వాతంత్య్రోద్యమ పంతం వీడం అంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని, భ రతమాత బానిస సంకెళ్ల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవ కిషోరుల బలిదా నం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశములోనే ఏకైక విద్యార్ధి సంఘం అన్నారు.

శాస్త్రీయ సోషలిజం తన గమ్యంగా, ప్రభుత్వ విద్యను, సెక్యులరిజాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం తన కర్తవ్యమని, సమరశీల విద్యార్థి ఉద్యమాల నిర్మాణంలో నిమగ్నమైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 89 వసంతాలు పూర్తిచేసుకుని 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న  విద్యా వ్యతిరేక విధానాలపై ఏఐఎస్‌ఎఫ్ గా పోరాడుతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వినయ్ సంజయ్ నవిత సోబిత ప్రణయ్ వంశీ కళ్యాణ్ తదితరులుపాల్గొన్నరు.