calender_icon.png 24 November, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరి సహకారంతోనే పార్టీ బలోపేతం

24-11-2025 01:39:19 AM

డీసీసీ నూతన అధ్యక్షుడు నరేష్ జాదవ్

ఆదిలాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి) : సీనియర్... జూనియర్... అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని వెళుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఆ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులు డాక్టర్. నరేష్ యాదవ్ అన్నారు. డీసీసీ అధ్యక్షునిగా నియమించిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయన కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.

ముందుగా నేరేడిగొండ టోల్ ప్లాజా వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నరేష్ జాదవ్ కు పుష్పలమాలలు వేసి, పుష్పగుచ్చ ని అందించి ఘనంగా స్వాగతించారు. అక్కడినుండి నేరుగా ఆదిలాబాద్ చేరుకొని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం, తన రాజకీయ గురువైన మాజీ మంత్రి స్వర్గీయ రామచంద్రా రెడ్డి (సి.అర్.ఆర్.) ఇంటికి వచ్చారు. పార్టీ శ్రేణులతో కలిసి నూతన అద్యక్షుడు సి.ఆర్.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు శాలువాలతో సత్కరించి అభినందించారు.

అదేవిధంగా నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు సైతం నూతన అధ్యక్షుని కలిసి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు నరేష్ జాదవ్ మాట్లాడుతూ... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికై ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు. నూతన అధ్యక్ష పదవి కత్తి మీద సాము లాంటిదని, అందరితో కలిసి పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవ రెడ్డి, లక్ష్మారెడ్డి, అంబకంటి అశోక్, సంజీవ్, రూపేష్ రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, నర్సింగ్, గిమ్మ సంతోష్ పాల్గొన్నారు.