07-11-2025 01:11:57 AM
వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
వేములవాడ టౌన్,నవంబర్ 6(విజయక్రాంతి): పట్టణపరిధిలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో హెవీ వెకిల్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించి చేసిన వేములవాడ అదనపు ఎస్పీ .ఈ సందర్భంగా వేములవాడ అదనపు ఎస్పీ మాట్లాడుతూ. ప్రతి వాహనదారు డు బాధ్యతగా వ్యవహరిస్తు రోడ్డు భద్రతా తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు నివారించాలని పిలుపునిచ్చారు.
నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం,కండిషన్ లో లేని వాహనాలు న డపటం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవించి చాలామంది తమ విలువైన ప్రాణాలను కో ల్పోతున్నారన్నారు.ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్,మద్యం సేవించి వాహనాలు నడపడం,ఓవర్ లోడ్,రాంగ్ రూట్లో ప్రయాణించడం,కండిషన్ లో లేనటువంటి వాహనాలు నడపటం లాంటి తప్పిదాలతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు.
భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు దూర ప్రయాణం చేసే సందర్భల్లో సరైన విశ్రాంతి తీసుకోవాలని దీని వల్ల ప్రమాదాలు నివారించవచ్చని,ప్రతి వాహనదారుడు వాహనాల కండిషన్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవా లి.పరిమితికి లోబడి వాహనాలు లోడ్ చేసుకోవాలని,మద్యం సేవించి,సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఈసందర్భంగా హెచ్చరించారు.
ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని,డ్రైవింగ్ అనేది వృత్తి మాత్రమే కాదని,అది అనేకమంది కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉందని గుర్తు చేశారు. ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం డ్రైవర్లతో రోడ్డు భద్రత నియమాలను పాటించాలనే ప్రతిజ్ఞ చేశారు.అంతకుముందు తిప్పపూర్ బస్టాండ్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా,టిప్పర్ లో డస్ట్ తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్ కి తరలించడం జరిగింది.ఈ సమావేశంలో పట్టణ సిఐ వీరప్రసాద్, ఎస్.ఐ లు రామ్మోహన్, రాజు,అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.