07-11-2025 01:09:26 AM
- రోడ్డు ప్రమాదాలకు బెల్ట్ షాప్‌లే కారణమా?
- అనారోగ్యం పాలవుతున్న జనాలు
- ప్రజల జేబులు ఖాళీ .. షాప్ వాళ్ళ జేబులు ఫుల్
అశ్వారావుపేట, నవంబర్ 6 (విజయక్రాంతి) : రాష్ట్రం లో ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్న ఆదాయ మార్గాలను అన్వేషిస్తా యి. గత రెండు దశాబ్దాలు గా బ్రాందీ షాప్ ల నిబంధనలు కటినంగా పాటిస్తూ, దొడ్డి దారిన ప్రభుత్వాలు బెల్ట్ షాప్ లకు ద్వారా లు తెరిచారు. బ్రాందీ షాపులు రోజుకు 12 గంటలు అమ్మకాలు చేస్తే, బెల్ట్ షాపులు మాత్రం 24 గంటలు అమ్మకాలు సాగిస్తున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆ దాయం పెరగటం ఏమో కానీ, బెల్ట్ షాపు లు యజమానులు లక్షల్లో ,బ్రాందీ షాప్ ల యజమానులు కోట్ల లో దోచుకుంటున్నారు.
ఎమ్ ఆర్ పి ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయాలు చేస్తున్నారు. బ్రాందీ షాప్ ల్లో దొరకని మద్యం బెల్ట్ షాప్ లో దొరుకుతుంది. కాకపోతే ఎక్కువ ధర పెట్టీ కొనుగోలు చేయాలి. బెల్ట్ షాప్ ల అమ్మకా లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతున్నాయా, అబ్కారీ అధికారులకు తెలియదా, కానీ అధికారులు మాత్రం బెల్ట్ షాప్ ల వైపు కన్నెత్తి చూడరు. ప్రభుత్వానికి కావాల్సింది అమ్మకాలు పెరగటం ఖజానా కు ఆదాయం రావాలి . కాకపోతే కోటాకు మించి అమ్మకాలు చేయాలంటే ప్రభుత్వానికి అదనంగా పన్ను కట్టాలి. అదనంగా కట్టాల్సిన పన్ను పేరుతో అధిక ధరల విక్రయాలతో దోచుకుంటున్నారు. కానీ ఇవి ఇవి అధికారులకు పట్టవు. అధికారుల మీద అ మ్మకాలు పెంచాలనే ఒత్తడి కూడా ఉంది.
రోడ్ ప్రమాదాలకు బెల్ట్ షాప్ లే కారణమా?
జాతీయ రహదారులు, రాష్ట్రైయ రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అర్ధ రాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా అమ్మకాలు చేస్తుండటం తో జనాలు, ట్రాక్టర్ డ్రైవర్లు, లారీల డ్రైవర్లు, చివరకు మైనర్ పిల్లలు కూడా మద్యం కొనుగోలు చేసి, ఎక్కడ పడితే అక్కడ అంటే రోడ్ పక్కన మైదాన ప్రాంతాలు, బడులు, క్రీడా ప్రాంగణాలు అన్ని మద్యం సేవించే కేంద్రాలుగా మారాయి. డ్రైవర్లు మాత్రం కావ లసినంత మద్యం లభించడం తో మద్యం సేవిస్తూ వాహనాలు నడుపుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. మార్గ మద్యం లో ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని సేవిస్తూ వెళుతున్నారు. ఈ క్రమం లోనే వాహనాలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి.
అనారోగ్యం పాలవుతున్న మందు బాబులు....
విచ్చుల విడిగా మద్యం లభ్యం అవుతుండటం తో చిన్న,పెద్ద మహిళలు అనే తారతమ్యాలు లేకుండా మద్యాన్ని సేవిస్తున్నారు. మద్యాన్ని అలవాటు పడిన వారు మద్యం సమయానికి దొరకక పోతే నరాలు లాగటం వణకటం, గుండెల్లో దఢ రావటం జరుగుతుంది. మద్యం సేవించే వారిలో మూడు వంతుల మంది కూలీ పనులు చేసుకోలేని దుస్థితి లో ఉన్నారు. కొందరికి ఊపిరి తిత్తుల వ్యాధుల భారిన పడ్డారు. కొందరికి మూత్ర పిండాలు పాడైన వారు ఉన్నారు. రోగాల భారిన పడిన వారు వైద్యం చేయించుకునేందుకు సొమ్ములు లేక నాటు మందులు వాడుతూ మృతి చెందిన వారు ఉన్నారు. ఆసుపత్రులకు వెళ్ళితే లక్షల్లో ఖర్చు అవుతుంది. వైద్యాన్ని కి డబ్బు లు లేకపోయినా. మద్యం సేవించేందుకు భార్యలను హింసించిన వారు ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు గ్రామాల్లో బెల్ట్ షాప్ లు తొలిగించి రోడ్ ప్రమాదాలు జరగకుండా, ప్రజలు అనారోగ్యం పాల్వకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు