calender_icon.png 4 July, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేద్దాం

04-07-2025 12:55:46 AM

మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి  

అబ్దుల్లాపూర్ మెట్, జూలై 3: ప్లాస్టిక్ భూతాన్ని పూర్తిగా తరిమేద్దామని పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీందర్ రెడ్డి అన్నారు. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో అంతర్జాతీయ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం పురస్కరించుకొని, అదేవిధంగా 100 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం పెద్ద అంబర్ పేట్ లో మున్సిపల్ సిబ్బంది పలు షాపులలో తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ కవర్ ల వాడకంపై షాపు యజమానులకు అవగాహన కల్పించారు.

అదేవిధంగా షాపులలో నిలువచేసిన ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్లాస్టిక్ వాడకాన్ని షాప్ లలో పూర్తిగా నిషేధించాలని అన్నారు. ప్లాస్టిక్ కవర్ లు వినియోగిస్తున్న షాపు యజమానులకు రూ. 15 వేల జరిమానా విధించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సిబ్బంది, కార్మికులు తదితరులుపాల్గొన్నారు.