23-06-2025 12:00:00 AM
పెన్ పహాడ్ : ప్రాణాలను కాపాడుకోవడానికి కలసి కట్టుగా ఏవిధంగా కరోనా మహమ్మారిని నిర్మూలించుకున్నామో అదే విదంగా ’ డ్రగ్స్ ’ అనే భూతాన్ని యువత ధరి చేరకుండా పాతరేద్దామని అందుకు సహకారం అందించాలని పెన్ పహాడ్ ఎస్‌ఐ గోపికృష్ణ అన్నారు.
ఆదివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాల లో మాదక ద్రవ్యాల నిర్మూలన పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్ననాటి నుంచే మంచి అలవాట్లను అలవర్చుకొని లక్ష్య దిశగా కష్టపడి కాదు ఇష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తోటి విద్యార్థులతో క్రమశిక్షణగా.. స్నేహపూర్వకంగా మెలగాలని అన్నారు.
ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ అనేది తీవ్ర సమస్యగా ఉన్నాయని వీటిని నిర్మూలనలో విద్యార్థుల విద్యార్థుల పాత్ర ఎంతో విలువైనదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ ఆసియా జబీన్, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయురాలు, విద్యార్థినీలు ఉన్నారు.