31-12-2025 01:23:40 AM
ఖమ్మం కేంద్రంగా జనవరి 18న సీపీఐ శత వసంతాల భారీ బహిరంగ సభ
జనవరి 3నుండి 7వరకు జిల్లా వ్యాప్తంగా ప్రచార జాత
విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా
పాల్వంచ, డిసెంబర్ 30, (విజయక్రాంతి): ఖమ్మం కేంద్రంగా జనవరి 18న జరిగే సిపిఐ శత వసంతాల ఉత్సవ ముగిం పు సభను ఉ త్సాహభరితంగా జరుపుకుందామని, ఇందుకోసం కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా పిలుపునిచ్చారు. పట్టణ పరిధిలోని గణేష్ సాయి ఫంక్షన్ హలో పాల్వం చ మండల, పట్టణ వి స్తృత కౌన్సిల్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ భారత దేశ స్వ తంత్రాని కంటే ముందే కాన్పూర్ లో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) దేశ స్వతంత్ర సంగ్రామంలో తనదైన పాత్ర పో షించిందన్నారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశానికి విముక్తి కలిగించేందు కు ఎందరో కమ్యూనిస్టు యువకిశోరాలు తన ప్రాణాలను పణంగా పెట్టారని చెప్పా రు. ఆనాటి నుండి నేటి వరకు పేదలు బడు గు బలహీన వర్గాలకు ఎర్రజెండా అండగా ఉందని. భారత గడ్డపై నూరేళ్లు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉన్న ఈ పార్టీ మరో వందేళ్లు కూడా మనగలదు అనడానికి ఎలాంటి సందేహం లేదని, ప్రజా క్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటాలు చేసే పార్టీలను ఎన్నేళ్లవరకైనా ప్రజలు ఆదరిస్తారని, అందుకు సిపిఐ ఏ నిదర్శనం అన్నారు.
ఖమ్మం కేంద్రంగా జరిగే శతవసంతాల ముగింపు సభకు 40 దేశాల నుండి ప్రతినిధులు తరలిరానున్నారని, కవులు మేధావులు కళాకారులు ఈ వేడుకలో పాల్పంచుకుంటున్నా రని చెప్పారు. ఈ జిల్లా నుండి 3000 మ ంది రెడ్ షర్ట్ వాలంటీర్లును కవాతు కోసం సిద్ధం చేస్తున్నాము అని తలిపారు. వందేళ్ల ముగింపు సందర్భంగా సుమారు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ జరగనుందని చెప్పారు. కార్యక్రమాన్ని పురస్కరిం చు కొని జిల్లా వ్యాప్తంగా ఖమ్మం బహిరంగ స భ జయప్రదం కోరుతూ జనవరి 3నుండి 7 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రచార జాత నిర్వహిస్తున్నట్లు తలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, ఉప్పుశెట్టి రాహుల్, జిల్లా సమితి సభ్యులు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, వీ పద్మజా, వేముల కొండలరావు, సీపీఐ స ర్పంచులు, ఉప్ప సర్పంచులు వార్డు సభ్యు లు, ప్రజాసంఘాల బాధ్యులు పాల్గొన్నారు.