calender_icon.png 31 December, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

31-12-2025 01:25:36 AM

ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వార దర్శనం

ఎర్రుపాలెం డిసెంబర్ 30 (విజయక్రాంతి): ముక్కోటి ఏకాదశి పర్వదినాన మండల వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో భక్తులు భగవంతుని దర్శించి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించారు. ఈరో జు న భగవంతుని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. భగవంతుని దర్శించుకుంటే ముక్కోటి దేవతల దర్శన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మండల కేంద్రమైన ఎర్రుపాలెం శివాలయం లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భక్తులు తెల్లవారుజామునంచే దైవదర్శనం చేసుకున్నారు.ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొని భగవంతుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. భగవంతున్ని దర్శించుకుని శ్రీమాన్ పూజారి నూరి గోపాలకృష్ణ శర్మ వారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శివాలయం దేవస్థానం చైర్మన్ మగినం జయశ్రీ , ఎండోమెంట్ ఈవో ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేసి క్యూ పద్ధతిలో భగవంతున్ని దర్శనానికి పంపించడం జరిగింది. తదుపరి భక్తులు భగవంతుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.