calender_icon.png 20 December, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతిని అంతమొందిద్దాం!

09-12-2025 12:00:00 AM

నేదునూరి కనకయ్య :

నేడు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం :-

భారతదేశంలో అవినీతి అన్ని రంగాల్లో, అన్ని రకాల సేవల్లో పేరుకుపోయింది. రేషన్ కార్డ్ పొం దడం నుంచి పరిశ్రమల స్థాపన వరకు అన్నిచోట్ల చేయి తడపాల్సిన దుస్థితి ఏర్పడింది. చిన్న చిన్న పనులు చేసే కాంట్రాక్టర్లకు తమ పనులు జరగాలంటే అవినీతి అనే ఆయుధాన్ని ఉపయోగించాల్సిందే. ప్రభుత్వ సేవలందించే ఉద్యోగులు.. వారి సేవలు పొందే ప్రజల మధ్య అవినీతి రాజ్యమేలుతుంది.

ప్రభుత్వం ఉచితంగా అందించే విద్య, వైద్య సేవల్లోనూ లంచం ఇవ్వందే పనులు జరగడం లేదు. అవినీతికి పాల్పడిన అధికారులను శిక్షించే చట్టాలు ఉన్నప్పటికీ, హెచ్చరికలు చేస్తున్నప్పటికీ సమాజంలో అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. అవినీతి, అధికారం ఒకే నాణేనికి రెండు ముఖాలుగా మారిపోయాయి. అవినీతిపై అవగా హన, చైతన్యం కలిగించడానికి.. దాన్ని ఎలా ఎదిరించాలనే విషయాలపై అవగాహన కల్పించడానికి నిర్దేశించిందే.. ‘అంత ర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం’.

దీనికింద ప్రపంచమంతటా పేరుకున్న అవినీతి, దాని నిర్మూలనకు ఉన్న చట్టాలపై కనీస అవగాహన, తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం జరుగుతుంది. 2003, అక్టోబర్ 31న ఐక్యరాజ్యసమితి అవినీతి వ్యతిరేక ఒప్పందాన్ని ఆమోదించింది. దానిపై సమితిలోని 190 సభ్యదేశాలు సంతకాలు చే యడంతో ప్రపంచంలో అవినీతిపై పోరాటాన్ని చట్టపరమైన విధిగా పరిగణించడం మొదలైంది.ఇదే సదస్సులో ప్రతి ఏడాది డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ‘అవినీతి వ్యతిరేక దినోత్సవం’ జరపాలని ఐరాస నిర్ణయించింది. 

అవినీతిలో పైపైకి..

ప్రపంచంలో అవినీతి లేని దేశం, రం గం లేకపోవడాన్ని ఊహించలేం. అవినీతి అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక క్యా న్సర్ ముప్పుగా మారింది. పేదల అభివృ ద్ధి కోసం అమలుచేసే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు అందని స్థితి నెలకొన్నది. వారి అభివృద్ధి కోసం అమలు చేసిన పథకాల్లో అవినీతి ఉన్న కారణంగా ఆశించిన ఫలితాలు రావడం లేదు. పేదవర్గాల జీవన ప్రమాణాలు, కొనుగోలు శక్తి పెరగక ‘సామాన్యుని సాధికారిత’ అనేది ఒక కలగానే మిగిలిపోతున్నది.

అవినీతి నిర్మూలనకు వ్యతిరేకంగా మన దేశంలో ప్రభుత్వాలు, ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా అవినీతి వ్యతిరేక పోరాటాలు చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఈ ఏడాది అవినీతి సూచీలో భారత్ ర్యాంకు మరింత దిగజారడమే దీనికి ఉదాహరణ. ప్రపంచ దేశాల అవినీతి సూచీలో భారత్ స్థానం అంతకంతకూ దిగజారుతుండడం ఆందోళన కలిగించే అంశమని చెప్పొచ్చు.

ప్రభుత్వ స్థాయిలో అవినీతి ఏ మేరకు రాజ్యమేలుతుందనేది నిపుణులు, వ్యాపారవేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ అనే సంస్థ సున్నా నుంచి 100 పాయింట్లను కేటాయిస్తుంది. సున్నా అయితే అవి నీతి ఎక్కువని, 100 అంతకంటే ఎక్కువగా ఉంటే అవినీతి రహితమని పేర్కొంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రాన్స్‌పరెన్సీ ఇం టర్నేషనల్ సంస్థ వెల్లడించిన అవినీతి సూచీకి సంబంధించి 180 దేశాలపై సర్వే నిర్వహించింది.

ఈ అధ్యయనంలో భారత్ 38 పాయింట్లతో 96వ స్థానంలో నిలిచింది. 2023లో 39 పాయింట్లతో 93వ స్థానంలో ఉంటే, 2022లో 40 పాయింట్లతో 85వ స్థానంలో నిలవడం గమ నార్హం. తాజాగా భారత్ 96వ స్థానంలో ని లవడం చూస్తుంటే దేశంలో అవినీతి ఏ మేర రాజ్యమేలుతుందనేది అర్థమవుతుంది. 

లంచంతోనే పని..

అవినీతి చిన్నగా మొదలై ఏడు తలల విషనాగులా మారిపోయింది. ఒక్క భారత దేశంలోనే అవినీతి పుట్టలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉ న్నంత అవినీతి మరెక్కడా లేదు. అవినీతి అడ్రస్ రాజకీయాలే. ఇది ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. కనీస మౌలిక వస తులు కూడా ఇవ్వకుండా రోజు రోజుకూ బీదవారిగా మార్చేస్తుంది. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకూ.. దేశాల నుం చి విదేశాల వరకూ అన్ని చోట్లా అవినీతి పంజా విసురుతూనే ఉంది.

అవినీతి వల్ల మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. దీనితో నేరాలు పెరుగుతున్నాయి. పేదరికంలో ఉన్న దేశాల్లో అవినీతి తక్కువగానే ఉన్నప్పటికీ.. అభివృద్ధి చెందుతున్న దేశా ల్లో అవినీతి మాత్రం ఎక్కువగానే ఉంటుం ది. ఒకప్పుడు లంచం తీసుకోవడాన్ని అడ్డుకునే జనం మొన్నటి ఎన్నికల్లో జనం ఏ పార్టీ ఎక్కువ ముట్టజెప్పుతుందో ఆ పార్టీకి మాత్రమే ఓటు వేస్తామని బహిరంగంగా ప్రకటించింది.

మరి పార్టీలు కూడా గెలిచాకా ప్రజలకు కష్టపడి సంపాదించుకునే విధానాన్ని మార్చి ఉచితాలను అందిస్తుం ది. దీంతో ఉచితాలకు జనం మరుగుతున్నారు. ఇంతటి తెగింపుకు రావడానికి భా రతదేశంలో పెరిగిపోతున్న అవినీతి మాత్ర మే కారణం. ఒక ఉద్యోగం కొన్న ఉద్యోగి, లంచంతో పని జరిపించుకున్న సామాన్యడు ఇలా ప్రతి ఒక్కరూ తమ హక్కును కాలరాసి అవినీతి వైపు మొగ్గుచూపుతూనే ఉన్నారు.

అదే హక్కుగా భావిస్తున్నారు. ప్ర భుత్వం, ప్రైవేటు ఇలా ఏ రంగం చూసుకు న్నా డబ్బులు ఇవ్వనిదే పని జరగని స్థాయి కి చేరుకుంది. ప్రభుత్వ నిధులు, పాలసీలు, పథకాలు అల్లంత దూరాన ఆగిపోతున్నా యి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే పలు అభివృధి సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న కుంభకోణాలు అవినీతికి అడ్డాగా మారి అభివృద్ధిని అడ్డుకుంటుందనడంలో సందేహం లేదు.

అవగాహన అవసరం..

అవినీతిని అంతమొందించేందుకు నీతి నిజాయితీ అనే ఉద్యమానికి నడుం కట్టా లి. అవినీతికి వ్యతిరేకంగా దేశంలోని ప్రతి కుటుంబం ఒక యూనిట్‌గా మారాలి. నీతి, నిజాయితీ, మానవీయ విలువలు వంటి అంశాలను పాఠశాల, కళాశాలల స్థాయిలో పాఠ్యాంశంగా చేర్చాలి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసేలా విద్యార్థులకు అవగాహన కలిగించాలి. యువత లో అవినీతి నిర్మూలన చట్టాల మీద సదస్సులు, సమావేశాలు నిర్వహించాలి. నీతి నిజాయితీతో చట్టబద్ధంగా విధులు నిర్వర్తించే ఉద్యోగులను అవార్డులతో సత్కరిం చాలి.

అవినీతికి పాల్పడి అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించాల్సిన బాధ్యతను ప్రజల్లో మరింత పెం చాల్సిన అవసరముంది. నిర్ణీత కాల వ్యవధిలో ఉద్యోగులు తమ బాధ్యతలు నిర్వ హించేలా పాలనా పరమైన సంస్కరణలు చేపట్టాలి. కేంద్ర స్థాయిలో అవినీతి నిరోధక విభాగం ఏర్పాటు, లోకాయుక్త, అం బుడ్స్‌మన్ వ్యవస్థ, సమాచార హక్కు చ ట్టం లాంటి వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరముంది.

సామాజిక బాధ్యతగా..

ప్రజల్లో  ప్రశ్నించే తత్వం.. పాలకుల్లో, అధికారుల్లో  జవాబుదారీతనం, పారదర్శకత పెరిగినప్పుడే అవినీతి అంతమయ్యే అవకాశముంటుంది. ప్రభుత్వ రంగ సంస్థ లు విడుదల చేస్తున్న నిధులు.. పనితీరును పారదర్శకంగా చూపగలిగితే కొంత మేర అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చు. ప్రతీ పౌ రుడికి ఆయుధమైన సమాచార హక్కు చట్టాన్ని మరింత పటిష్టం చేసి అవినీతికి పాల్పడుతున్న అధికారులు, వ్యవస్థకు సం బంధించిన సమాచారాన్ని సేకరించి కోర్టులలో  ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖ లు చేసే అవకాశాన్ని మరింత వేగవంతం చేయాలి.

అవినీతి నిర్మూలనను ప్రతి పౌ రుడు ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరముంది. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అనేది వదిలిపెట్టి ప్రతీ పౌరు డు చైతన్యం ప్రదర్శించి అవినీతిని పారద్రోలేందుకు ఉద్యమం చేయాలి. అవినీతి నిర్మూలన చట్టాలపై అవగాహన పెంచుకొని దేశాన్ని, రాష్ట్రాలను అవినీతి రహితం గా మార్చుకుందాం. ప్రభుత్వం, పౌరసమాజం, మహిళా శక్తి, యువత, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా ఉద్యమించి అవినీతి ర హిత భారత్ నిర్మాణానికి పాటుపడదాం.