06-10-2025 12:00:00 AM
సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబు
కాగజ్‌నగర్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళ రాష్ట్ర ఐద వ సదస్సులు ప్రారంభం సందర్భంగా బాల భారతి స్కూల్ నుంచి వినయ్ గార్డెన్ వరకు గుస్సాడి, ఒగ్గుడోలు, డోలు, ఆదివాసి, ఇతర కళారూపాలతో మార్కెట్ వీధులలో అంబేద్కర్ చౌరస్తా, రాజీవ్ చౌరస్తా, లారీ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా భారీ ర్యాలీ వినయ్ గార్డెన్ వరకు నిర్వహించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభకు సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆర్ త్రివేణి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సిఐటియు జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు పాల్గొని మాట్లాడారు. సమాజంలో సగభాగంగా ఉన్నటు వంటి మహిళలు నేటి పాలకుల విధానాల ఫలితంగా ఆర్థిక రాజకీయ అన్ని రంగాలలో వివక్షతకు గురవుతున్నారని, కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం విధానా లకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, శ్రామిక మహి ళ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్ వి రమ, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపా ల్, జే వెంకటేష్, పి జయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జే. రాజేందర్, ముంజం శ్రీనివాస్,
ప్రజాసంఘాల నాయకులు కూశన రాజన్న, దుర్గం దినకర్ , కోట శ్రీనివాస్ , ముంజo ఆనంద్ కుమార్, గోడిసెల కార్తీక్, గేడం టికానంద్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వి.ఆనం ద్, జిల్లా కార్యదర్శి ఆర్ మహేష్ , తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నేర్పల్లి అశోక్, బక్కన్న,వివిధ జిల్లాల నాయకులు, శ్రామిక మహిళలు పాల్గొన్నారు.