calender_icon.png 29 September, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు జడ్పీ పీఠం బహుమతిగా అందిద్దాం

29-09-2025 01:10:49 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కాగజ్‌నగర్, సెప్టెంబర్ ౨౮ (విజయక్రాం తి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ ను బిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామని ఆసిఫాబాద్ ఎమ్మె ల్యే కోవలక్ష్మి అన్నారు. ఆదివారం వినయ్ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన బిఆర్‌ఎస్ కార్యకర్త ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బిఆర్‌ఎస్ లో చేరి ఆదివారం కాగజ్ నగర్ కు వచ్చిన సందర్భంగా కార్యకర్తలు రైల్వే స్టేషన్‌లో ఘన స్వాగతం పలికారు. అనంత రం రైల్వే స్టేషన్ నుంచి ద్విచక్ర వాహనం ర్యాలీ నిర్వహించారు. 

ర్యాలీ ప్రధాన వీధుల గుండా వినయ్ గార్డెన్ వరకు సాగింది. అనంతరం వినయ్ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన కార్యకర్త సమాసం మాజీ ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌లో ఎలాంటి వర్గాలు లేవని,  ఉన్నది ఒక్కటే కెసిఆర్ వర్గం అని స్పష్టం చేశారు. గతంలో బిఆర్‌ఎస్ హాయంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐక్యంగా ఉండి అన్ని స్థానాలను బిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచే విధంగా తమ వంతు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గస్థాయి నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.