29-09-2025 01:11:44 AM
తెలంగాణ బీసీ‘ఎ’కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. బాగయ్య డిమాండ్
ముషీరాబాద్, సెప్టెంబర్ 28 (విజయ క్రాంతి): బీసీలకు స్థానిక సంస్థల కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజ ర్వేషన్లలో బీసీ ‘ఎ’కులాలకు జనాభా ప్రాతిపదిన వాటా కల్పించాలని తెలంగాణ బీసీ ‘ఎ’హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. భాగ్య భాగయ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్. నరహరిలు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో వారు మా ట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 78 సంవత్సరాలు గడుసున్నప్పటికీ వెనుకబడిన కులాల్లో కేవలం 5 కులాలు మాత్రమే రిజర్వేషన్లు పొందుతున్నాయని, కాని బీసీ ‘ఎ’లోని 73 కులాలకు రిజర్వేషన్లలో అన్యా యం జరు గుతున్నదని, ముఖ్యంగా విద్యా, ఉద్యోగ రంగాలలో తీవ్రంగా అన్యాయం జరుగుతు న్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన జాబితా ను బహిర్గతం చేసి, వారి కులాల వారిగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 73 బీసీ ‘ఎ’ కులాలకు12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీ ‘ఎ’జాబితాలో ఇతర స్థానిక, స్థానికేతర కులాలను చేర్చరాదని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నమితి ప్రతినిధులు రామ్ చందర్, జగదీష్, గడప శ్రీహరి, సుధాకర్, జితేందర్, రాజలింగం పాల్గొన్నారు.