29-09-2025 01:09:23 AM
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్, సెప్టెంబర్ ౨౮ (విజయ క్రాం తి): రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండా ఎగిరే దిశగా ప్రజలు అడుగులు వేస్తున్నామని మ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం నియోజజవర్గంలోని ఇచ్చోడ మండలంలోని ముఖ్రా (బి) గ్రామ పంచాయతీ పరిధిలోని రఘు గూడ, మంకు గూడ గ్రామానికి చెంది న పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మళ్ళీ కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని తెలుసుకొని వారి వెంటే నడవాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మారుతి, శేఖర్ ఉన్నారు.