10-07-2025 01:07:24 AM
- డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి
- రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రమంత్రికి వినతి
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): భూమిని, పర్యావరణాన్ని రక్షించాలని పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి మండలి జాతీయ సలహాదారు, తెలంగాణ రాష్ట్ర గ్రీన్ అంబాసిడర్, టీఆర్ హెచ్‌ఎస్‌ఎస్ జాతీయ సలహా దారు డాక్టర్ లయన్ కోమటిరెడ్డి గోపాల్‌రెడ్డి అన్నారు. సేంద్రియ వ్యవసాయ శిక్షణ, రైతుల సమస్యల పరిష్కారానికి బుధవారం ఢిల్లీలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ సింగ్ చౌదరిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రైతుల శ్రేయస్సు, వ్యవసాయ నైపుణ్య అభివృద్ధి, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సా హం అంశాలపై చరిచారు. త్యాగి జీ, ఆర్‌ఎల్‌డి జాతీయ ప్రధాన కార్యదర్శి కపిల్వాయి దిలీప్ కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు విట్టల్, ప్రముఖ జర్నలిస్టు, ప్రజానీక మిత్రుడు డాక్టర్ గోపాల్‌రెడ్డి మాట్లాడు తూ.. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు తగిన శిక్షణ లేకపోవడం, పెట్టుబడి తిరిగి రాకపోవడం వంటి సమస్యల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు.
ఈ సమ స్యను పరిష్కరించేందుకు, ఈపీడీసీ ఆధ్వర్యంలో ఫీల్డ్ లెవెల్ శిక్షణ చేపట్టాలని కోరా రు. ఈ సందర్భంగా కేంద్ర నైపుణ్య అభివృద్ధి మం త్రిత్వ శాఖ కార్యక్రమానికి సానుకూలంగా స్పందించింది. ఈ యూనిట్ ప్రో గ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి, ఈపీడీసీతో తో సహకరించాలని గోపాల్‌రెడ్డి కోరారు.