calender_icon.png 12 September, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిమనదుల హెచ్చరిక

04-09-2025 12:00:00 AM

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లాలో గత నెల 5న వరుణుడు విలయ తాండవం చేశాడు. జల విలయానికి సమీపంలోని ధరా లీ వరదల్లో కొట్టుకుపోయింది. అదే విధంగా జమ్మూ కశ్మీర్‌లోని కిష్టార్ జిల్లాలోనూ ఆగస్టు 14న తీవ్ర ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. చినాబ్ నది తీరంలో ఉన్న మొత్తం గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే నెల 26న వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే దారిలో వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు చనిపోయారు.

ఇలా మనం చెప్పుకున్న ప్రతీ ఒక్కటి ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగానే కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న హిమాలయ పర్వతశ్రేణుల్లోని హిమానీ నదాలు వేగంగా కరుగుతుండటమే. హెచ్చుమీరుతున్న భూతాపం వల్ల హిమ నదులు వేగంగా కరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలే క్లౌడ్ బరస్ట్‌లు పెరిగిపోవడం, కొండచరియలు విరిగిపడటం, తరచూ భూకంపాలు రావడం దీనికి సంకేతాలుగా చెప్పవచ్చు.

భారత ఉపఖండానికి సం బంధించి ‘హిందూకుష్’ హిమాలయ ప్రాంతంలోని ఎత్తయిన పర్వతాల్లో హిమానీ నదాలు ఆవరించి ఉన్నాయి. ఆసియాలోని 200 కోట్లకు పైగా ప్రజలకు తాగునీరు, జీవనోపాధి కల్పిస్తున్న గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి నదులకు హిమాలయాలే పుట్టినిళ్లు. ఉష్ణోగ్రత పెరుగుదలతో పర్వతశ్రేణుల్లో హిమానీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయి. హిమాలయాల్లో మంచు వేగంగా క్షీణిస్తుండటంతో కరిగిన నీరు దిగువన సరస్సుల్లో కలవడం వల్ల వాటి పరిమాణం పెరిగిపోతుంది.

హిమాలయాలకు దిగువన ఉన్న 10 హెక్టార్ల కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్న 2,431 హిమానీ సరస్సులసై ఇటీవలే ఇస్రో అధ్యయనం జరిపింది. వాటిలో 676 సరస్సుల విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్లు  తేలింది. ఈ పరిణామం జీవరాశులపై తీవ్ర ప్ర భావం చూపుతుందని, అక్కడి ప్రజలను వరదల రూపంలో నిత్యం ప్రమాదం వెంటాడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పర్వతశ్రేణుల మధ్యన ఉన్న సరస్సులు, చెరువులు మంచునీటితో నిండి ఒక్కసారిగా ఉప్పొంగడం వల్లనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తరచూ విపత్తులు సంభవిస్తున్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హిమ నదులు వేగంగా కరగడం వల్ల సముద్ర మట్టాలు పైకి ఎగబాకుతాయి. ఒక అధ్యయనం ప్రకారం 1880 నుంచి ప్రపంచ సముద్ర మట్టాలు ఎనిమిది నుంచి తొమ్మిది అంగుళాల మేర పెరిగాయి.

అంటార్కిటికాలోని థ్వైట్స్ హిమానీనదం ఊహించదానికంటే నాలుగు రెట్లు వేగంగా కరిగిపోతోంద ని పరిశీలనలు స్పష్టం చేస్తున్నాయి. ఇది పూర్తిగా కరిగితే సముద్ర మట్టాలు మూడు మీటర్ల మేర పెరుగుతాయని, దానివల్ల అనేక తీర ప్రాం తాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. భూమిపై హిమనదులు ఏర్పడటానికి లక్ష ల సంవత్సరాలు పట్టింది. జీవం ఉనికికి, అభివృద్ధికి ఈ మంచు ఎంతో దోహదపడింది.

మన భవిష్యత్తు తరాలు భద్రంగా ఉండాలంటే హి మ న దులను కాపాడుకోవాలి. ఇందుకోసం భూతాపాన్ని కట్టడి చేయాలి. అన్ని దేశాలు సమష్టిగా ఈ బాధ్యతను భుజానికెత్తుకోవాలి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, పునరుత్పాదక వనరుల వైపు మొగ్గు చూపాలి. పచ్చదనాన్ని పెంచి ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా వాతావరణ మార్పులు నిరోధిస్తే కరుగుతున్న హిమ నదులను కొంతైనా కట్టడి చేయొచ్చు.