calender_icon.png 10 September, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం

05-09-2025 12:46:25 AM

  1. గ్రామ గ్రామాన సీపీఐ జెండా ఎగరాలి

ఫారెస్ట్ అధికారుల కవ్వింపు చర్యలు మానుకోవాలి

పాల్వంచ/భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి)రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ సత్తా చాటాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం పిలుపు ని చ్చారు. గురువారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో సీపీఐ మండల కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పాల్వంచ ప్రాంతంలో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలు ఎదురుకుంటున సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీనీ మరింత విస్తరణకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రతి గ్రామంలో రా నున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ ప్రాతినిధ్యం ఉండే విధంగా గ్రామాల్లో కార్యకర్తలను ప్రజలను సిద్ధం చేయాలని కోరారు.

పోడు సాగు దారుల పట్ల ఫారెస్ట్ అధికారుల కవ్వింపు చర్యలు తక్షణమే మానుకోవాలని, ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే సమయానికి పంటను ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారులు వైఖరి మార్చుకోకుంటే ప్రతిఘటన పోరాటాలు తప్పవని హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభమై పంటలు సీజన్ నడుస్తున్న వ్యవ సాయానికి సరిపడా యూనియన్ సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, తక్షణమే రాష్ట్రానికి కేటాయించిన పది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

పాల్వంచ ప్రాంత సమగ్ర అభివృద్ధిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రత్యేక ద్రుష్టి సారించారని, ఇప్పటికే వివిధ పథకాలతో రోడ్లు, డ్రైన్లు, నీటి పథకాలు శరవేగంగా పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పనులు త్వరలో ప్రారంభం అవుతాయన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, మండల సహాయ కార్యదర్శి గుండాల నాగరాజు, నాయకులు నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు, మనేం వెంకన్న, వేములపల్లి శ్రీను, బానోత్ రంజిత్, కొంగర అప్పారావు, చందూలాల్, మాజీ సర్పంచ్ లు భూక్యా విజయ, హరి, రమేష్, మరియమ్మ, లచ్చిరాం, పోలబోయిన వెంకటేశ్వర్లు, నిట్ట అమృతరావు, జకరయ్య తదితరులు పాల్గొన్నారు.