05-09-2025 12:46:01 AM
-ఎమ్మెల్యే పాయల్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరిక
ఆదిలాబాద్, సెప్టెంబర్ 4(విజయక్రాం తి): గతంలో పరిపాలించిన బీఆర్‌ఎస్, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సాత్నాల మండలంలోని మాం గోర్ల, దేవిజి గూడకు సంబంధించిన కాం గ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గురువా రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. అనంతరం పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ వల్ల నేడు గ్రామాలలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు రాక అభివృద్ధి కుంటు పడుతుందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ, రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చిన భారతీయ జన తా పార్టీని గెలిపించాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్, పోతరాజు రమేష్, సురేష్, రోహిదాస్, తదితరులు ఉన్నారు.