05-05-2025 12:00:00 AM
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి
హుజూర్‌నగర్, మే 4 : భారత ప్రభుత్వం తీసుకునే రాజ్యాంగబద్ధం నిర్ణయాలను స్వాగతిద్దామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్‌లో జరిగిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యవస్థను నష్టపరిచే భావజాలాన్ని వామపక్ష పార్టీ సమర్థించదన్నారు.
ఉగ్రవాద దాడు లను అన్ని పక్షాల లాగానే మానవతా వాదానికి వ్యతిరేకమైన హింసను ఖండిస్తున్నట్లు తెలిపారు. తుపాకుల ద్వారా నే చరిత్ర మారు తుందనే సిద్ధాంతానికి మేము వ్యతిరేకం అన్నారు. ప్రతి విషయానికి చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని సిపిఐ నమ్ముతుం దన్నారు.
కర్రే గుట్ట ఆపరేషన్ ను వెంటనే నిలుపుదల చేయాలని, అక్కడున్న మావోయిస్టులతో శాంతియుతంగా చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం ఎన్ కౌంటర్లను నివారించాలని కోరారు. ఈ సమయంలో మావోయిస్టుల కూడా చట్టపరంగా ఉద్యమాలు చేసి ప్రజల్లో మార్పు తీసు కొచ్చేందుకు ప్రయత్నిద్దామని పిలుపుని స్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురా లు పశ్యపద్మ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్ నాయక్, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన, సిపిఐ జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకటే శ్వర్లు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు,రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొడ్డ వెంకటయ్య, కౌలు రైతు సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పోజు సూర్య నారాయణ, యల్లావుల రమేష్ పాల్గొన్నారు.