calender_icon.png 6 May, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ వధువు ఆత్మహత్య

05-05-2025 12:00:00 AM

హుజూర్ నగర్, మే 4: తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హుజూర్ నగర్ పట్టణం లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ పట్టణానికి చెందిన షేక్ ఖసీంబీ తన కుమార్తె అగు షేక్ మహబూబి అలియాస్ హసీనా (19 సం.రాలు) ను తేదీ 30.4.25 రోజున చింతలపాలెం గ్రామానికి చెందిన షేక్ యూసఫ్ కు ఇచ్చి వివాహం చేయగా తేది 3.4.25 రోజున తన భర్త తో కలిసి పుట్టింటికి వచ్చింది.

తేదీ 4.5.25 రోజున ఉదయం 9.30 గంటల సమయంలో మృతురాలు బాత్ రూం లో స్నానానికి వెళ్లి ఇనుప కడ్డీకి ఉరి వేసుకుని చనిపోయిందని తల్లి ఖాసీంబీ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హుజూర్నగర్ యస్ ఐ జి ముత్తయ్య తెలిపారు.