calender_icon.png 25 August, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం

25-08-2025 07:20:18 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్...

హనుమకొండ/కెయు క్యాంపస్ (విజయక్రాంతి): వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, రసాయనాల వినియోగం వల్ల జల వనరులు, కాలుష్యానికి గురవుతాయాని, అందుచేత కృత్రిమ రంగులు, రసాయనాలతో చేసిన విగ్రహాలను మానివేసి మట్టితో చేసిన విగ్రహాలను పూజించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణం పట్ల ప్రజల్ని చైతన్యపరిచే విధంగా గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్టించి పూజిద్దాం అనే నినాదంతో రూపొందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా వినాయక విగ్రహాల పంపిణి కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అధికారులు ప్రారంభించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ  వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షించాలని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతి జిల్లాకు 2000 వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి , జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.