25-08-2025 07:21:17 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): బిజెపి హుజురాబాద్ పట్టణ, మండల శాఖ అధ్యక్షులు తుర్పాటి రాజు, రావుల కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాహుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో భారతీయ జనతా పార్టీ ఎంపీల పై నిరాధార అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణలోని 8మంది బీజేపీ ఎంపీ లు దొంగ ఓట్ల తో గెలిచారని నిరాదర ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగం మీద ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ స్వతంత్ర్య సంస్థ మీద దాడి చేశారన్నారు. నిజంగానే భారతీయ జనతా పార్టీ దొంగ ఓట్లు వేపించుకుంటే 240 స్థానాలకు బదులు 400 స్థానాలు వచ్చేవని, మహేష్ కుమార్ గౌడ్ ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మర్చిపోయినట్టున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ హిందుత్వం మీద హిందూ దేవతల మీద హిందుత్వం కోసం పోరాటం చేస్తున్న నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్ప హిందువుల కోసం చేసింది ఏమీ లేదు అన్నారు. బేషరతు గా తెలంగాణ బిజెపి ఎంపీలకు, ఓట్లు వేసిన ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న స్థానిక సంస్థలలో కచ్చితంగా కర్రుకాల్చి వాత పెడతారని విమర్శించారు.