calender_icon.png 19 October, 2025 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయాలి

18-10-2025 12:00:00 AM

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యలో భాగంగా తక్షణమే గ్రంథాలయాలు ఏర్పాటు చేసి, లైబ్రేరియన్‌లను నియమించాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీలో విద్య కీలక అంశం. అక్షరాస్యతలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉండాలంటే ఈ సంవత్సరంలోనే ఈ గ్రంథాలయ అంశాన్ని అమలు చేయాలి. అ న్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు పూర్తిస్థాయి గ్రంథాలయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.

గురుకుల, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో భర్తీ చేసిన విధంగా ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణమే లైబ్రేరియన్ పోస్టులను డీఎస్సీకి అనుబంధంగా వేసి భర్తీ చే యాలని కోరుతున్నాం. ఈ విధంగా సమగ్రమైన నిర్ణయం తీసుకున్నప్పుడే, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా పే రుపొందడమే గాక, నాణ్యమైన విద్యను అందించిన ప్రభుత్వంగా నిలుస్తుంది. నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చినప్పుడే తెలంగాణ రైజింగ్ 2047 కల సాకారమైనట్టని గు ర్తుంచుకోవాలి. 

 రాజు, కరీంనగర్