calender_icon.png 19 October, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లలో సమన్యాయమేదీ?

17-10-2025 12:15:36 AM

అల్లెపు రాజు :

భారతదేశంలో అన్ని వ్యవస్థల్లో అత్యున్నతమైనది న్యాయవ్యవస్థ. దేశంలోని చట్ట సభలను, కార్య నిర్వాహక విభాగమును ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజా ఉపయోగం కాని చట్టాలను రద్దు చేస్తూ, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంటుంది. రాజ్యాంగ బద్ధంగా చట్టాలను రూపొందించి వాటిని అమలు చేసేందుకు న్యాయ వ్యవస్థ పని చేస్తుంది. అలాంటి న్యాయవ్యవస్థ నేడు దేశ ప్రజలకు ఒక అపనమ్మకాన్ని కలిగే స్థితిలో నిలిచింది. న్యాయ గౌరవానికి భంగం కలిగే విధంగా ఈ మధ్యకాలంలో కొన్ని తీర్పులు రావడం ఆశ్చర్యపరుస్తోంది. అలాంటి తీర్పుల్లో మచ్చుకు కొన్ని ఎస్సీ వర్గీకరణ, ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు.  

ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణను చూ సుకుంటే.. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆనాడు అన్యాయమైన వర్గీకరణ నేడు న్యాయం ఎలా అయిందనేది ఆలోచించుకోవాలి. ఆ తీర్పు తత్ఫలితంగా కొన్నేళ్లుగా భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో షెడ్యూల్ కాస్ట్‌లోని కిందివర్గాలు త మ అవకాశాలను, హక్కులను కొన్నేళ్లుగా కోల్పోయారు. ఈ నష్టం పూడ్చలేనిది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయానికొస్తే..

దేశంలో మైనారిటీగా ఉన్న అగ్రవర్ణాలకు, జనాభాలో మెజారిటీగా ఉన్న ఓబీ సీలకు కూడా సగభాగమే రిజర్వేషన్ అం దించడం విచిత్రమైన విషయం. ఇది ఎక్క డి న్యాయమైన గణిత సూత్రమనేది మేధావులు ఆలోచించాల్సిన అవసరముంది. సహజంగానే భారత దేశ జనాభాను నాలుగు కేటగిరీలుగా విభజించారు.

అవి ఎస్సీలు, ఎస్టీలు, ఓబిసిలు, ఓసీ కేటగిరీలుగా ఉన్నాయి. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీలు స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుం చే వారి జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో రాజ్యాంగబద్ధంగానే రిజర్వేషన్లు పొందుతున్నారు. అయితే ఓబీసీలు మాత్రం ఈ విషయం లో మొదటి నుంచి నిరాదరణకు గురవుతూనే వస్తున్నారు. 

ఓబీసీలకు నిరాధరణే

ప్రధానంగా ఓబీసీ కులాల్లో వందల రకాల ఉత్పత్తి కులాలు, సేవా కులాలు, సంచార కులాలు ఉన్నాయి. ఈ కులాల్లో ప్రధానంగా భూమి, ఇల్లు అంటూ ఉండ దు. నిత్యం రోజు వారి సంపాదనతో తమ కుటుంబాలను పోషించుకుంటూ వస్తున్నారు. వీరు ఉత్పత్తి కులాలుగా తమ వ స్తువులను ఉత్పత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో 1990లో భారత దేశంలో ప్రవేశించిన నూతన ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని తమ ఉత్పత్తి సాధ నాలకు మార్కెట్ సౌకర్యం లేక బహుళ జాతి కంపెనీల ఆధిపత్యాన్ని తట్టుకోలేక వృత్తులు పూర్తిగా కనుమరుగయ్యాయి.

నేడు దేశంలోని ఓబీసీ జనాభాలో సగభాగం చిన్నా చితక పనులు చేసుకుంటూ నిర్మాణ రంగంలో కార్మికులుగా, గుమస్తాలుగా, అసంఘటిత రంగంలో కోట్లాది మంది ప్రజలు విద్య, ఉద్యోగాల్లో అత్తెసరు వాటా రిజర్వేషన్లతోనే కాలం గడుపుతున్నారు. రాజకీయ ప్రాతినిధ్యంలో ఇప్పటికీ కొన్ని వందల కులాలకు చెందిన వ్యక్తులు గ్రామ సర్పంచ్‌లు కూడా కాలేకపోయారు. ఇక చట్టసభల్లో వారి ప్రవేశం ఎంతనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

దేశంలో నేటికి ఎన్నో కులాలు బతుకుజీవనం కో సం వీధుల వెంట పాములను, కోతులను ఆడిస్తూ.. స్థిరమైన నివాసం, ఊరు ,పేరు లేకుండా సంచార జీవనం గడుపుతూ అ త్యంత దుర్లభంగా కాలం వెల్లదీస్తున్నారు. రాజ్యాంగం అందించిన ఫలాలు కొంతమందికి అందుతున్నాయన్న విషయం ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తున్న దేశ అత్యున్నత న్యాయస్థానం వారిని సరైన దారిలో నడిపించాల్సింది పోయి చేష్టలుడి గి చోద్యం చూస్తూ ఉంటే సంచార జాతి కులాలకు న్యాయం ఎలా జరుగుతుందనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇప్పటికై నా న్యాయవ్యవస్థ వాస్తవ పరిస్థితులను క్షు ణ్ణంగా పరిశీలించి ఆయా వర్గాలకు న్యా యం చేసేందుకు పాటు పడాల్సిన అవసరముంది. 

పునఃసమీక్ష అవసరమే

అసలు రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఆ యా వర్గాలకు కల్పించారన్నది ఇవాళ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. నిజానికి ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఊరికే ఇవ్వలేదు. రిజర్వేషన్లు కల్పిం చడం వెనుక చాలా బలమైన చారిత్రాత్మక, సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటు కారణాలే ఎక్కువగా ఉన్నాయి. వేల ఏళ్ల రాచరిక పాలన నుంచి నేటి స్వాతంత్య్ర, గణతంత్ర రాజ్య ఏర్పాటు దాకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు.. సామాజిక అంటరానితనానికి, వెట్టిచాకిరికి దూరం చేసేందుకు రిజ ర్వేషన్లు ఉపక్రమించాయి.

అందుకే స్వతం త్ర భారతంలో అణచివేయబడ్డ అన్ని వర్గాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడా నికి ఆనాడు రాజ్యాంగం వారికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పించింది. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఇవాళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాయి. అంతేకానీ దోపిడీ, అణచివేత లేకుండా రిజర్వేషన్లు కొన్ని వర్గాలకు ఉదారంగా పక్షపాతంతో కల్పించబడలేదన్న విషయాన్ని గుర్తించాలి. అయితే ఇందులో మరో తిరకాసు కూడా ఉంది.

ఎస్సీ, ఎస్టీలకు మాత్ర మే రాజ్యాంగబద్ధంగా రాజకీయ ప్రాతిని ధ్యం కల్పించారు కానీ ఓబీసీలకు మాత్రం ఎలాంటి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వలే దు. అయితే నేటి సమాజంలో ఎన్నో మా ర్పులు వచ్చాయి ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ పుణ్యమా అని మార్కెట్ ఒడిదు డుకులకు లోనవ్వడంతో ఉన్నత వ ర్గాలు కూడా ఆర్థికంగా చితికి పోయాయి. ఆర్థిక వెనుకబాటుతనం పేరుతో ఇవాళ ఉన్నత వర్గాలకు కూడా 10 శాతం (ఈడబ్ల్యూఎ స్) రిజర్వేషన్లు కల్పించారు.

కాబట్టి సుప్రీంకోర్టు నేడు రిజర్వేషన్లపై మరొకసారి పునః సమీక్షించవలసిన అవసరం ఎంతైనా ఉం ది. సమాజంలో వస్తున్న మా ర్పుల దృ శ్యా పెరుగుతున్న ఆర్థిక అసమానతలు కా వచ్చు, రాజకీయ ప్రాతి నిధ్యం కొన్ని వర్గాలకే పరిమితమయ్యా యి. చట్టసభల్లో అ న్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే దేశం అన్ని రం గాల్లో స్వయం సమృద్ధి సాధిస్తుంది లేదంటే అశాంతి, అస్థిరత, ఆర్థిక అసమానతలతో దేశం నిరంతరం ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంటుంది.      

సమన్యాయంతోనే

రిజర్వేషన్ల కల్పన నిజంగానే ప్రతిభకు గొడ్డలి పెట్టా అన్నది ఆలోచించాల్సిన అం శం. ఒకవేళ రిజర్వేషన్ల కల్పనతో ప్రతిభావంతులైన నిపుణులకు కొరత ఏర్పడు తుందనుకుంటే దీనికి మార్గాలు అనేకం. ప్రభుత్వాలు ఏర్పాటు చేసే నియామక ఉత్తర్వుల్లో రిజర్వేషన్ అనేది అభ్యర్థుల అర్హత ప్రమాణాలను ఓపెన్ కేటగిరి అభ్యర్థులతో సమానంగా ఉండేలా న్యాయ స్థానం చట్టం తెచ్చేందుకు ప్రయత్నం చే యాలి.

అంతేకానీ కొన్ని దశాబ్దాలుగా వెనుకబాటుతనానికి గురైన ఎన్నో వర్గాలను ప్రతిభను బూచి చూపి రిజర్వేషన్లకు దూరంగా ఉంచడం సమాజానికి అంత శ్రేయస్కరం కాదు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పన అనేది కచ్చితంగా ప్రతిభావంతులకు కొరతే అనుకుంటే ఇప్పటికీ వెనుబడి ఉన్న కులాలకు విద్య, రాజకీయ ప్రాతినిధ్యంలోనైనా వారి జనాభా దామాషా ప్ర కారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.

విద్య, రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం వల్ల కనీసం వారు ఎంతో కొంత విజ్ఞానవంతులయ్యే అవకాశం ఉంటుంది.  దీనికి తోడు ఆయా వర్గాలు సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కూడా ఉంది. రా నున్న పదేళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలబడేందుకు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రిజర్వేష న్ల పునఃవ్యవస్థీకరణ విషయంలో సత్వరం చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

లేదంటే మన హక్కులు పొందడానికి స్వాతంత్య్ర సమరంలో అసువులు బాసిన ఎంతో మంది త్యాగదనుల ప్రాణాలకు న్యాయం చూకూర్చని వాళ్లమవుతాం. ముఖ్యంగా దేశ ప్రధాన వ్యవస్థలైన చట్ట సభలు, కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేసినప్పుడే దేశ అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అందుకే పరిపాలనలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం క ల్పించినప్పుడే దేశ సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.    

 వ్యాసకర్త సెల్: 7386412601