calender_icon.png 18 November, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు నిరంతర కృషితో కొనసాగిస్తే విజయం సాధించగలరు

18-11-2025 07:20:09 PM

జిల్లా ఉపాధి కల్పన అధికారిణి డా. యం. ప్రియాంక  

గద్వాల: విద్యార్థులు ప్రతి చిన్న ప్రయత్నాన్ని క్రమంగా, నిరంతర కృషితో కొనసాగిస్తే విజయం సాధించగలరని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి డా. యం. ప్రియాంక అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం 18వ తేదీన గద్వాల్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర, గద్వాల్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ & కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి డా. యం. ప్రియాంక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె 10వ తరగతి విద్యార్థులకు భవిష్యత్తు లక్ష్యాలను నిర్ధేశించుకోవడం, సరైన విద్యా మార్గాలు ఎంచుకోవడం, ఉన్నత విద్యా అవకాశాలు, వివిధ ఉద్యోగ అవకాశాల గురించి వివరణాత్మకంగా చెప్పారు.

10వ తరగతి తర్వాత అందుబాటులో ఉన్న ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి కోర్సులు, వాటి ద్వారా ఏ రంగాల్లో కెరీర్ సాధించవచ్చో, అవసరమైన సబ్జెక్టులు, విద్యా ప్రాధాన్యతలు, తదితర అంశాలను స్పష్టంగా వివరించారు. ప్రతీ గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతో ప్రారంభమవుతుందని తెలిపారు.జీవితంలో ఎదురయ్యే కష్టాలను,సమస్యలను తట్టుకోవడానికి స్థిరమైన ప్రయత్నం, నిరంతర ధైర్యం అవసరమని తెలిపారు. చిన్న అవకాశాలను కూడా గమనించి, వాటిని గొప్ప విజయానికి పునాదిగా మార్చడంలో మీ ప్రయత్నం కీలకమని తెలిపారు.

చదువులో ప్రతీ గంటను జ్ఞానాన్ని సేకరించడం కోసం వినియోగించండి,అలాగే పునశ్చరణ(Revision) ద్వారా మీ మెదడును పదును పెట్టాలన్నారు. ఈ స్థిరమైన ప్రణాళికలు, నిరంతర ప్రయత్నాలు మీ లక్ష్యాలను చేరుకోవడానికి దోహదం చేస్తాయని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించబడే ఆహారాన్ని తనకు స్వయంగా పరీక్షించి, వంట మరియు స్టోర్ రూమ్ పరిశీలించారు.వంటసిబ్బందికి, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించడానికి అవసరమైన మార్గదర్శకాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో EWRC-EGMM ట్రైనర్ మహేష్, పాఠశాల ప్రిన్సిపాల్ రేణుకదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.