18-11-2025 07:22:53 PM
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ స్వారోస్ జిల్లా కమిటీ అధ్యక్షునిగా పరకాల మండలం మాదారం కు చెందిన మంద మనోజ్ ను నియమించినట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారమల్ల ప్రకాష్, కన్వీనర్ పుల్ల కిషన్ లు ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం మంద మనోజ్ మాట్లాడుతూ... డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచన, ఆశయాలకు అనుగుణంగా గత 13 సంవత్సరాల క్రితం ఏర్పడిన స్వేరో సంస్థకు గత పది సంవత్సరాల నుండి పనిచేస్తూ స్వేరో ఉద్యమంలో వివిధ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తూ, సంఘాన్ని బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. స్వేరోస్ సంఘాన్ని జిల్లాలో ఉన్న 14 మండలాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలు, విద్యార్థుల సమస్యలను ప్రధానంగా వెలికి తీసి వారికి స్వేరోస్ తరఫున అండగా నిలబడి అధికారుల ద్వారా న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని, అన్ని గ్రామాలలో స్వేరోస్ జెండాను ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.