18-11-2025 07:22:42 PM
కుంటాల (విజయక్రాంతి): బైంసా పట్టణంలోని నిర్వహించిన రైతు సమస్యలు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ నుండి బైంసాకు వెళ్తున్న కేటీఆర్ కు మంగళవారం రోజు కల్లూరులోని స్థానిక కుంటాల లోకేశ్వరం మండలాల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ కు అభివాదం తెలిపి కేటీఆర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన నవ్వుతూ ప్రతి ఒక్కరికి కారులో నుండి లేచి అభివాదం తెలిపారు. దీంతో అభిమానుల్లో ఉత్తేజ నింపింది కేటీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో వెంటనే ఆయన బైంసా పట్టణంలోని రైతులకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇబ్బందులు పెట్టడం మూలంగా రైతులు సమస్యలు తెలుసుకునేందుకు కల్లూరులో ఆగారు. దీంతో ఆయనకు టపాకాయలతో స్వాగతం పలుకుతూ అభివాదం తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకుల అభిమానులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.