22-09-2025 12:00:00 AM
కరీంనగర్, సెప్టెంబరు 21 (విజయ క్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ లైసెనస్డ్ సర్వేయర్లకు భూభారతి చట్టంలో తమ సేవలకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణ్ రావులను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
గత 1520 సంవత్స రాలుగా 52 మంది సర్వేయర్లు వివిధ మం డల తహసీల్దార్ కార్యాలయాల్లో లైసెనస్డ్ సర్వేయర్లుగా విధులు నిర్వర్తించిన అనుభవాన్ని గుర్తుచేస్తూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తీసుకొన్న భూభారతి చట్టంలో సర్వే మ్యాప్ తప్పనిసరి చేసినందున, ఈ సేవల ను మొదటి ప్రాధాన్యతగా సీనియర్ లైసెనస్డ్ సర్వేయర్లతో వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి సర్దార్ హర్మిందర్ సింగ్, జి ల్లా సర్వే & ల్యాండ్ రికార్డ్ యూనియన్ అధ్యక్షుడు బి శ్రీనివాస్, కార్యదర్శి పి జీవన్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా లైసెనస్డ్ సర్వేయర్ యూనియన్ అధ్యక్షుడు పి జగన్ మో హన్, కార్యదర్శి కె విజేందర్ రెడ్డి, అలాగే సర్వేయర్లు, వెంకటేశం, లక్ష్మణ్, కరుణాకర్, కృష్ణ, సురేష్, రాజు, గోపాల్, శ్రీనివాస్ రావు, తదితరులుపాల్గొన్నారు.