18-07-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ జూలై 17 (విజయ క్రాంతి) : పోక్సో కేసులో ఓ నిందితుడికి జీవిత ఖైదు తో పాటు రూ 10,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు నిచ్చిం ది. 2016లో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించగా మహబూబ్నగర్ జి ల్లాలోని ప్రత్యేక సెషన్స్ కోర్టు లో విచారణ పూర్తయి, నిందితుడైన జిలకరపురం కృష్ణ య్య (వయస్సు 35) గడిదిర్యాల్ గ్రామం, గండీడ్ మండలం, మహబూబ్నగర్, కు జీవి త ఖైదు రూ. 10,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది.
అప్పటి దర్యాప్తు అధికారుల కృషి, న్యాయవాదుల పట్టుదలతో న్యా యవ్యవస్థ ద్వారా బాధితురాలికి న్యాయం లభించడం జరిగిందని ఎస్పీ తెలియజేశారు. మహబూబ్నగర్ రూరల్ సీఐ గాంధీ నా యక్, ఎస్త్స్ర శేఖర్ రెడ్డి, ఏఎస్‌ఐ బాలకృష్ణ, గతంలో విధులు నిర్వహించిన పోలీస్ సి బ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.