27-10-2025 01:41:23 AM
విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ
ఖైరతాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి) : వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ టోర్నమెంట్‌ను నవంబర్ 23న సరూర్ నగర ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు విజన్ మార్షల్ ఆరట్స్ అకాడమీ ఫౌండర్ విఠల్ తెలిపారు.
ఈ మేరకు ఆదివారం బంజారాహిల్స్ లోని తమ సంస్థ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథి టైక్వాండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి తో కలిసి ఇందుకు సంబంధించిన పోస్టర్, టీ షరట్స్ లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..లిమ్కా బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు ఉంది అని అన్నారు.
ఈ ఈవెంట్ లో ఆరు సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు ప్రతి ఒక్కరూ ఈవెంట్‌లో పాల్గొనవచ్చునని తెలిపారు. 30 నిమిషాలలో ఎక్కువ రౌండ్ హౌస్ కిక్స్ ఎవరు చేస్తారో వారికి ఈ రికార్డు సొంతమవుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 1000 మంది పార్టిసిపెంట్స్ ఈ ఈవెంట్లో పాల్గొంటారని తెలిపారు.
గజేందర్ కుమార్, అబ్దుల్లీ ఖలీల్ ఈ ఈవెంట్‌కు న్యాయ నిర్ణయితలుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇలాంటి ఈవెంట్లు నిర్వహించడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ కు విద్యార్థులు చేరువయ్యేందుకు ఈవెంట్లు ఉపయోగపడతా యని మాస్టర్ జయంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.