calender_icon.png 16 October, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

15-10-2025 04:33:13 PM

గుండాల (విజయక్రాంతి): మండలంలో ఉన్న రైతులందరు తమ పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని, పశు వైద్య అధికారి డా.యాకూబ్ అన్నారు. మండల కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువుల ఆరోగ్యాన్నీ పరిరక్షించుకోవాలని తెలిపారు. 236 పశువులకు టీకాలు వేశామని తెలిపారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రాజు గోపాలమిత్రలు గోవిందు, కిష్టయ్య, శ్రీను, నరేష్, శేఖర్ సోమశేఖర్, రైతులు పాల్గొన్నారు.