15-10-2025 04:35:05 PM
పాపన్నపేట (విజయక్రాంతి): పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన లోకేష్ ఎస్జీఎఫ్ క్రీడలలో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక అయినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు, స్టూడెంట్ కౌన్సిలర్ సంతోష్ కుమార్ తెలిపారు. పటాన్ చెరువులో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలో పాల్గొని రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. కొడపాకకు చెందిన లోకేష్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల కళాశాల సిబ్బంది, గ్రామస్తులు లోకేష్ ను అభినందించారు.