calender_icon.png 7 November, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాయిడ్స్ టెక్నాలజీ చారిత్రాత్మక రికార్డు

07-11-2025 01:17:24 AM

ఒకే రోజు లక్ష కిలోల బియ్యం విరాళం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్ అయిన లాయిడ్స్ ఆఫ్షోర్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సమాజ సంక్షేమం పట్ల తమ నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని ప్రకటించింది. గురువారం ఈ సంస్థ కార్పొరేట్ దాతృత్వంలో సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. హైదరాబాద్‌లోని బహుళ ప్రభుత్వేతర సంస్థలకు (ఎన్‌జీవోలకు) ఒకే రోజు లక్ష కిలోల బియ్యాన్ని విరాళంగా ఇచ్చి దేశంలోనే ఏసియా బుక్ ఆఫ్ రికార్డును సృష్టించింది.

ఉద్యోగులు 50 వేల కిలోల బియ్యాన్ని అందించగా, సంస్థ మరో 50 వేల బియ్యాన్ని జోడించింది. ఈ బియ్యాన్ని 55 ఎన్జీవో కేంద్రాల ద్వారా పంపిణీ చేశారు. దీని వలన వేలాది మంది లబ్దిదారులకు సహాయం అందింది. లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, మేనేజింగ్ డైరెక్టర్ శిరీష వోరుగంటి మాట్లాడుతూ.. “లాయిడ్స్‌లో నిజమైన పురోగతి కేవలం వ్యాపార విజయంతోనే కాకుండా, మనం సమాజంలో సృష్టించే సానుకూల ప్రభావంతో కూడా కొలవబడుతుందని మేము నమ్ముతాము. ఈ గొప్ప కార్యక్రమాన్ని సాకారం చేయడానికి కలిసి వచ్చిన మా బృందాలకు, భాగస్వాములకు కృతజ్ఞతలు” అని అని అన్నారు. ఈ రికార్డును నెలకొల్పిన డ్రైవ్‌కు డా విపుల్ సింగ్, డైరెక్టర్, హెడ్ ఆఫ్ హెచ్‌ఆర్ పీపుల్, ప్లేసెస్‌తో సహా నాయకత్వ బృందం గట్టి మద్దతు ఇచ్చింది.