calender_icon.png 7 November, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఆశ’ల ఆవిరి...

07-11-2025 01:16:11 AM

  1. ఏడాది కాలంగా క్యాన్సర్ ఇబ్బందులు

నేడు భర్త బ్రెయిన్ ట్యూమర్తో కోమాలోకి

కన్నతండ్రి లేడు కట్టుకున్నోడు హస్పిటల్లో

అయోమయంలో ‘ఆశా’ కార్యకర్త కుటుంబం

ఎల్లారెడ్డిపేట,నవంబర్ 6(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్లారెడ్డిపేట మండలం తనతోటి స్నేహితులతో ఆడుతూపాడుతూ ఉన్న వయసులోనే కన్నతండ్రి మృతి చెందిన నాటి నుంచి కుటుంబ సమస్యలు వెంటాడుతున్న ఓ ఆశా కార్యకర్త నేడు భర్త సైతం మెదడులో రక్తం గడ్డకట్టడంతో కోమాలోకి వెల్లగా పుట్టెడు దుఖంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెలితే మండల కేంద్రానికి చెందిన కొరి రామవ్వ-బాబు దంపతుల ఒక్కగాక్క కుమార్తె స్వప్న లత చిన్న తనంలో ఉండగానే తండ్రి బాబు మృతి చెందాడు.

రామవ్వ తన కూతురు ఏలోటూ రాకుండా పోషించుకుంది. దుమాలకు చెందిన నీరెంక రవితో వివాహం జరిపించగా వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించింది. ఇక తన కుటుంబానికి ఏ లోటూ లేకుండా చిన్న కుటుంబం సంతోషంగా గడుస్తుందని ఆశ పడింది. గ్రామంలో ఆశావర్కర్గా పని చేస్తూ ఊరందరికీ తలలో నాలికలా ఉండేది. ఈ లోగా లతకు గత ఏడాది క్రితం ఒంట్లో బాగుండక పోవడంతో హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకోగా క్యాన్సర్గా నిర్దారితమైంది.

దీంతో దాతలు, అధికారులు తలా కొంత సాయం చేయగా తాము సైతం అప్పు తెచ్చుకుని చికిత్స చేయించుకుంటుండగా ఇటీవల కొంత కుదుట పడుతున్నది. కాగా గ్రామంలో సెంట్రింగ్ పనులు చేసుకుంటూ రవి కొంత చేదోడువాదోడుగా ఉంటున్నాడు. బుధవారం ఉదయం తల విఫరీతంగా ప్పి ఉందని చెప్పి ఇంటి ముందు కూర్చొని కుప్పకూలిపోయి నోటి మాట లేకుండా పడిపోయాడు.

దీంతో మండల కేంద్రంలోని అశ్వినీ హాస్పిటల్కు తరలించగా పరిస్థితి విశమంగా ఉందని చెప్పడంతో అక్కడ నుంచి చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు. పుట్టెడు బాధల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు 8309071003కు పోన్పే చేయాలని కోరారు.