20-07-2024 12:17:14 AM
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
జయశంకర్ భూపాలపల్లి, జూలై 19(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి, అమలు చేసిన రైతు రుణమాఫీ దేశానికే రోల్ మోడల్ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రైతు రుణమాఫీ సంబురాల్లో భాగంగా శుక్రవారం భూపాలపల్లిలోని మంజూర్ నగర్ సింగరేణి ఏరియా ఆస్పత్రి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రైతులు, కాంగ్రెస్ నేతలు ఎడ్లబండ్లు, ట్రాక్టర్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేసి నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో అప్పుల ఊబిలోకి నెట్టిందని, కష్టకాలంలో ఉండి కూడా సీఎం రేవంత్‌రెడ్డి రైతు సంక్షేమం కోసం రుణమాఫీ చేశారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రేపు మంత్రుల పర్యటన
జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో ఈ నెల 21న మంత్రులు దుద్దిళ్ల శ్రీధ ర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ, ఎంపీ కడియం కావ్య పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయ ణరావు తెలిపారు. మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.