20-07-2024 12:14:06 AM
హైదరాబాద్, జూలై19 (విజయక్రాంతి): జవర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీలోని జర్నలి స్టుల దశాబ్ద కల నేరవేరబోతోందని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో జర్నలిస్టులకు కేటాయించిన పేట్‌బషీరాబాద్ స్థలం స్వాధీనం చేసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
త్వరలోనే మీడియా అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్ట్‌ల మహాసభను ఏర్పాటు చేసి.. అక్కడే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఉత్తర్వులు అందజేస్తారని చెప్పారు. మిగిలిన జర్నలిస్టులకు కూడా పాలసీ ప్రకటన, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడం వంటి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ సభలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొని, మన కలను సాకరం కావడానికి కారణమైన సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మీడియా అకాడమీ తరఫున కృతజ్ఞతలు తెలియజేద్దామని సూచించారు.