24-06-2025 01:28:23 AM
-రూ.150 కోట్లు అందజేసిన ఇండియన్ బ్యాంక్ యాజమాన్యం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సాధికారతను ప్రోత్సహించేందుకు తెలంగాణలో ఇండియన్ బ్యాంక్ హైదరాబాద్ మెగా ఎస్‌హెచ్‌జీ, క్రెడిట్ అవుటచ్ శిబిరాలు నిర్వహించింది. రాష్ట్రంలో ఎస్‌హెచ్‌జీల కోసం మొత్తంగా రూ.150 కోట్ల రుణాలు మంజూరు చేసింది.
సోమవా రం హైదరాబాద్‌లో స్థానిక మహిళా సంఘ సభ్యులకు బ్యాంకు అధికారులు రుణాలు అందజేశారు. ఈ ఈ శిబిరానికి శివ్ బజరంగ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కార్పొరేట్ కార్యాలయం, చెన్నై గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు బ్యాంకుకు చెందిన ప్రముఖ అధికారులు, ఫీల్డ్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ప్రా ణేష్ కుమార్ ఫీల్డ్ జనరల్ మేనేజర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కె శ్రీనివాస్ జోనల్ మేనే జర్, హైదరాబాద్, పి.ఎస్.ఎస్. సుధాకర్‌రావు జోనల్ మేనేజర్, కరీంనగర్, స్వర్ణ ప్రభా సుందర్రాయ్ జోనల్ మేనేజర్, మ ల్కాజ్‌గిరి హాజరై తెలంగాణలో ఎస్‌హెచ్‌జీ లింకేజ్, క్రెడిట్ విస్తరణపై తమ దృఢమైన నిబద్ధతను తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్రంలోని మూడు జోన్లకు కలిపి రూ.150 కోట్ల రుణాలను మంజూరు చేశారు. హైదరాబాద్ జోన్‌కు రూ.50 కో ట్లు, కరీంనగర్ జోన్‌కు రూ.55 కోట్లు, మ ల్కాజిగిరి జోన్‌కు రూ.45 కోట్లు మంజూరు చేశారు. ఈ సందర్భంగా శివ్ బజరంగ్ సింగ్ మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘా లు సమాజంలో సమగ్ర ఆర్థికాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. మహిళల సాధికారతకు ఇండియన్ బ్యాంక్ నిరంతరం మద్దతునిచ్చి శక్తినిచ్చే చర్యలను తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.