08-07-2025 12:25:01 AM
వెనుకబడిన తరగతుల ప్రజాప్రతినిధుల వేదిక
ఖైరతాబాద్, జూలై 7 (విజయ క్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వెనుకబడిన తరగతుల ప్రజాప్రతినిధుల వేదిక రాష్ర్ట ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వస్తా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గడిల కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ చందర్ లు మాట్లాడారు.. ఈనెల 10వ తేదీన జరిగే రాష్ర్ట క్యాబినెట్ సమావేశంలో రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళితే బీసీ వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తమ డిమాండ్లను నెరవేర్చుకునేం దుకు 15వ తేదీన ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద పదివేల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే మరో సకల జనుల సమ్మె తరహాలో మరో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట నాయకులు యాదగిరి,సత్యం సాగర్, శ్రీనివాస్ గౌడ్, అరుణ్ కుమర్ , తిరుపతయ్య, సదానందం తదితరులు పాల్గొన్నారు.