calender_icon.png 8 July, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం..

08-07-2025 12:26:38 AM

ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం  గాంధీనగర్ బ్రిడ్జి వద్ద నూతన  ఎమ్మార్పీఎస్ జెండాను డివిజన్ ఇంచార్జ్ ఇల్లెందులు ఎల్లయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్,  ఎంఎస్పి  ముషీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ గజ్జెల రాజ శేఖర్ మాదిగ  ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ 31 సంవత్సరాల ఉద్యమం ఎస్సీ  వర్గీ కరణ సాధించిన ఘనత పద్మశ్రీ మందా కృ ష్ణ మాదిగ  సామాజిక న్యాయం  రాజ్యాధికారమే లక్ష్యమన్నారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గండి కృష్ణ మాదిగ, ఎం ఈ ఎఫ్  సీనియర్ నాయకులు. పాపిడి రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ డివిజన్ నాయకులు చిలక ఎల్లయ్య మాదిగ, ఎం ఎస్ పి  సీనియర్ నాయకులు. నక్క రామారావు మాదిగ, అమ్మగూడెం దశరథ్ మాదిగ, రోషన్ వినాయక రావు మాదిగ, గడ్డం రమేష్ మాదిగ, మహంకాళి వెంకటయ్య మాదిగ,  దేశ్ పాండే నాగరాజు మాదిగ, లక్ష్యం గల్లా నర్సింగరావు మాదిగ, పులిపాక విజయ్ కృష్ణ మాదిగ, సాయిలు మాదిగ తదితరులు పాల్గొన్నారు.