29-11-2025 12:00:00 AM
-వేడెక్కిన రాజకీయం, మొదలైన హడావుడి
-ఓటర్ల మద్దతుకు ఆశావహుల పాట్లు
-గెలుపు ధీమాలో అధికార పార్టీ
-పట్టు సాధించేందుకు కారు.. కసరత్తు
-మోదీ నామంతో కమలనాథులు
-కమ్యూనిస్టులు ఉద్యమాలకే పరిమితం
-ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అన్ని పార్టీలు
మణుగూరు, నవంబర్ 28 (విజయక్రాంతి),: గ్రామ స్థాయిలో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ప్రజాప్రతినిధి వ్యవస్థ పం చాయతీలు. కాగా, స్థానిక ఎన్నికల ప్రకటన రావడంతో పల్లెల్లో ఔత్సాహితుల సందడి నెలకొంది. పోటీకి దిగే ఆలోచన ఉన్న వారు నాయకులను ప్రసన్నం చేసుకొని జోరుగా నామినేషన్లు వేస్తున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయం ఓక్క సారిగా వేడెక్కింది. వార్డు సభ్యులు, సర్పంచ్ గా నిలబడేందుకు యువ త సైతం ఉవ్విళ్లూ రుతోంది.
ఆత్మీయ పలకరింపులు, దావత్లు, అభివృద్ధి కార్యక్రమాల హామీలు, కుల సంఘాలతో భేటీలతో వారు తీరక లేకుండా గడుపుతున్నారు. గ్రామాల్లో ఎవరు సర్పంచ్ అభ్యర్ధిగా నిలబడాలో శాసించేది ఆఖరికి రాజకీయ పార్టీలే అయి నా, పార్టీల జోక్యంతో ఎన్నికలు మరింత రంజుగా సాగుతున్నాయి. ఊళ్లల్లో పై చేతి గుర్తుదా, లేక కారు దా, కమల మా, సుత్తి, కంకి కొడవలా, ఎవరు బలప రిచిన అభ్యర్ధి గెలుస్తాడనే దానిపైనే ఇప్పుడు చర్చంతా జరుగుతోంది. ఇంతకీ ఓటర్ల మనసులో ఏముంది.ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? పంచాయతీ ఎన్నికల తీరుతేన్నునులపై విజయ క్రాంతి కథనం..
ఆ ఇద్దరు నేతలకు అగ్నిపరీక్షే..
ఇప్పటికే పినపాక నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తమ సత్తా సాటేందుకు సన్నా హాలు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రె స్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికే నియోజకవర్గ స్థాయి సమావేశాలు, నిర్వహించి కార్యకర్తలకు ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు గీతోపదేశం చేశారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు స్థాని క పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా రు. నియోజకవర్గంలో ఒకరిపై మరొకరు పై చెయ్యిసాధించి పట్టు నిలుపుకునేందుకు పావులు కదుపుతున్నారు. గెలుపు గుర్రాల కోసం వేట మొదలు పెట్టారు. సర్పంచ్, వా ర్డు సభ్యుల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.
వేడెక్కిన రాజకీయం, మొదలైన హడా వుడి..
అభ్యర్ధుల ఎంపిక దిశగా తాజా, మాజీ ఎమ్మెల్యేలు గెలుపు గుర్రాలపై దృష్టి కేంద్రీ కరిస్తున్నారు. ఆర్ధిక, సామాజిక అండ, పార్టీ, కేడర్ లో పట్టుతో పాటు నమ్మిన బంట్లు అయితే పెద్దపీట వేసేందుకు సిద్ధంగా ఉన్నా రు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి, మొన్నటి మొన్న జూబ్లీ ఫలితం ఊరించి ఉసూరునిపించడంతో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి పోయిన పరువును నిలబెట్టు కోవాలని, కాంగ్రెస్ పై కసి తీర్చుకో వాలని పట్టుదల తో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు కాంతారావు పార్టీ కేడర్ ను సిద్ధం చేస్తుండగా పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు గ్రామాల వారీగా గెలుపు గుర్రాల కోసం జల్లెడ పడుతున్నారు.
సర్పంచ్ ఆశావహ అభ్యర్థుల పూర్వపరాలు, బలాబలాలు, చరిష్మా, సేవలపై ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొనగా, అదే దూకుడును కొనసాగించేలా ముందస్తు ప్రణాళికతో అత్యధిక స్థానాలలో పార్టీ అభ్యర్థులను గెలిపించి క్షేత్రస్థాయిలో తన పట్టును మరోసారి నిరూపిం చుకునేందుకు పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా భాస్ కు సవాల్...
గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆ పార్టీ, పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పునుజ్జీవనం పొందే ఆలోచన లో ఉంది. ఈ మేరకు పదేళ్ల పాలనలో పం చాయతీల అభివృద్ధికి చేసిన కృషి, గ్రామా ల్లో కల్పించిన మౌలిక వసతులను గుర్తు చేయడం ద్వారా పల్లె ఓటర్లను ప్రసన్నం చేసుకొని, పల్లెల్లో పట్టు నిలుపు కొనేందుకు బీఆర్‌ఎస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గులాబీ శ్రేణులతో సమాయత్తం అవుతున్నారు.
విస్తృతస్థాయి సమీక్షలు నిర్వహించి, కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపేప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో లేమన్న భావనను కార్యకర్తల్లో నుంచి తొలగించి, స్థానిక ఎన్నికల్లో కార్యోన్ముఖులుగా తీర్చి దిద్దేందుకు ముమ్మర యత్నాలు చేయడంలో బీఆర్‌ఎస్ ముందంజలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నా రు. 14 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజ ల్లో వచ్చిన తీవ్ర వ్యతిరేకతే.. బీఆర్‌ఎస్ కు కలిసి వస్తుందన్న ధీమాల్లో ఆ పార్టీ శ్రేణు లున్నారు. నియోజకవర్గ పరిధిలోని పల్లెల్లో బీఆర్‌ఎస్కు ఇప్పటికీ గట్టి పునాదులే ఉన్నా యి. క్యాడర్తోపాటు క్రియాశీల నాయకులు ఉన్నారు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందడం ఆ పార్టీ జిల్లా బాస్ కి సవాల్గా మారింది.
సంక్షేమ కార్యక్రమాలే రక్ష
స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఇంకా స్తబ్దుగానే ఉంది. ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక చేపట్టలేదు. ఆ పార్టీకి ముందు నుంచి ఉన్న భావజాలంతో పాటు ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలే తమకు రక్షగా ఉంటాయని కమలనాథు లు భావిస్తున్నారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ స్థానాలను గెలుచు కోవడం ద్వారా గ్రామ స్థాయిలో ఆ పార్టీ పునాదులను పట్టిష్టం చేసుకొనే పనిలో నిమగ్నమైంది. ఈ స్థానిక సమరంలో పట్టును నిలుపు కొంటుందా లేదా అనేది వేచిచూడాల్సిందే.
కమ్యూనిస్టులు ఉద్యమాలకే పరిమితం
కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎంలు ప్రజా సమస్యలపై పోరాటాలకే పరిమిత మయ్యాయి. ప్రజల్లో ఆ పార్టీకి పట్టు చిక్క డంలేదు. స్థానిక ఎన్నికల్లో పట్టు సాధిస్తుందనే నమ్మకం లేకపోయినా, అభ్యర్థుల గెలుపోటములను కొన్నిచోట్ల శాసించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటి పట్టు నిలుపుకునే పట్టుకునే ప్రయత్నంలో ఎవరికి వారే ముందున్నారు.