calender_icon.png 8 October, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘స్థానికం’ అగ్నిపరీక్షే!

08-10-2025 12:18:38 AM

- పట్టు సాధించేందుకు ఎమ్మెల్యే బండ్ల యత్నం

- బలం నిరూపించుకునేందుకు బీఆరెఎస్ నేతలు

- మేమూ బరిలోనే అంటూ బీజేపీ నాయకులు

- బీ - ఫారాలు దక్కకుంటే రెబెల్‌గా చేసేందుకు రెడీ

గద్వాల, అక్టోబర్ 07 ( విజయక్రాంతి ) : రానున్న జడ్పీటీసి ఎంపీటీసి, సర్పంచుల ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బిజెపి, స్వ తంత్ర పార్టీలకు అగ్నిపరీక్షగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సాధించేందు కు పట్టుదలతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహరచన చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఫలితాలతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండేందుకు సంకేతాలుగా మారనున్నాయి. ఇప్ప టికే ఆరుగ్యారెంటీ హామీలతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా పార్టీలు సత్తా చాటేందుకు ఈ ఎన్నికలు ఈ అవకాశంగా మారనున్నా యి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీ ఆర్‌ఎస్ గద్వాల అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందగా మిగతా స్థానాల్లో ఓటమి పాలయింది. గద్వాల నుం డి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ నుండి విజేయుడు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జోగుళాంబ గద్వాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా మారింది. కాని గద్వాల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలు పొందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను అభివృద్ధి కోసం సీఎం రేవంత్ తో కలిసి పని చేస్తానని ప్రకటించారు. అధికార పార్టీలోనే ఇద్దరు నేతలు ఉండటం కొసమెరుపు. 

బలం నిరూపణ కోసం బీఆర్‌ఎస్ ఆరాటం..

జిల్లా ఏర్పాటైన తర్వాత జడ్పీ పీఠాన్ని కే వసం చేసుకున్న బీఆర్‌ఎస్ మరోమారు పట్టు నిలుపుకోవాలనే ఆలోచనతో ఉంది. గత ఎన్నికల్లో మెజార్టీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని పీఠాన్ని దక్కించుకుంది. ఈసారి కూడా అదే పంథా కొనసాగించాలని చూస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గంలోని గ ద్వాల ధరూరు, కేటిదొడ్డి, గట్టు మల్డకల్ జ డ్పిటిసి, ఎంపిపి స్థానాలు కైవసం చేసుకునేందుకు బీఆర్‌ఎస్ పార్టీ దృష్టి సారించింది. గ ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి గెలుపొందినప్పటికీ అభివృద్ధి కోసం సీఎం రేవంత్రెడ్డితో కలిసి ప నిచేస్తున్నానని ప్రకటించారు. దీంతో గద్వాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ పట్టు సాధించేందుకు బాసు హన్మంతు నాయుడుకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో అన్ని మండలాలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ బలోపేతం చేస్తూ కార్యకర్తలో మనోధైర్యాన్ని నింపుతున్నారు..

 మెజారిటీ కులస్థులు ఎటు వైపు...

 గద్వాల్ నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లుగా బోయ కులస్తులుండగా, కుర్వ, ఎస్సీ, తెలుగు,మున్నూరు, మైనార్టీ సామాజిక వ ర్గానికి చెందిన ఓటర్లు తదితర స్థానాలలో ఉన్నారు. బోయ సామాజిక వర్గానికి చెంది న బీఆర్‌ఎస్ పార్టీ బాసు హన్మంతు నాయు డు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే అవాకాశాలున్నాయి. స్థానికంగా బాసు హన్మంతునాయుడుకు తానేమీటో సత్తా చూపుకోవడా నికి ఇదే సరైన అవకాశం అని మేధావులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికలల్లో తాను సైతం బీసి సా మాజికవర్గం నుంచి పోటీల్లో ఉన్నామన్నా సంకేతాలు పంపించే అవకాశాలున్నాయని అందుకోసం ఇప్పటి నుంచి నాయకుల, కా ర్యకర్తల అండదండలను పొందడానికి, నా యకుల మద్దతు కూడగట్టుకోవడానికి య త్నిస్తున్నారు. మరి మెజారిటీ కులస్థులు ఎ టు వైపు నిలబడుతారు అన్నదే ప్రశ్న గా మిగిలింది. 

తాము సైతం రేసులో....బాజాపా

జిల్లా పరిషత్ ఎన్నికల్లో మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసి స్థానాలను దక్కించుకొని కాషాయం జెండా ఎగురవేయడానికి కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత అ సెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి బరిలో దిగిన బీసి నాయకుడు బలిగెర శివారెడ్డి అత్యల్ప ఓట్లు లభించాయి. 2028 జరిగే అ సెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బరిలో ఉందంటూ నిరూపించడానికి రానున్న స్థాని క సంస్థల ఎన్నికల్లో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎ ంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను అత్యధికంగా కైవసం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేపట్టింది.

ఇందుకు గాను మహబూబ్ నగర్ ఎంపీ డికేఅరుణ ఆదేశానుసారంగా జిల్లా అధ్యక్షుడు రామాంజనే యులు, ప్రధాన కార్యదర్శి డికె స్నిగ్దారెడ్డి ఆ ధ్వర్యంలో గ్రామాలలో, పట్టణాలలో కేం ద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజలకు వివరిస్తూ... బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేసేందుకు నేతలు కృషి చేస్తున్నారు. ఏదీ ఏమైన స్థానిక సంస్థ ఎన్నికలు బీజేపీ పార్టీకీ బూస్టప్ ఇస్తే రాబోయే అసెం బ్లీ ఎన్నికల్లో గద్వాల కోటపై బీజేపీ పార్టీ జెండా ఎగురవేస్తుందన్నా సంకేతాలు ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.

సరిత వర్గీయుల్లో ఆందోళన 

గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరిత ఓటమి పాలైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజించుకుంది. స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన సరిత కు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసి, మై నార్టీ ఓటర్లు సరిత వైప్పే మొగ్గు చూపడంతో అదిష్టానం ఆశీస్సులు మెండుగా లభించా యి. ఇటీవల బీఅర్‌ఎస్ నుంచి గెలుపొందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అభివృద్ది కోసం సీఎం రేవంత్ రెడ్డి తో కలి సి పని చేస్తానని ప్రకటించడంతో మొదటి నుంచి సరిత వర్గీయులు వ్యతిరేకించిన కూ డా అదిష్టానం పెద్దలు ఎమ్మెల్యే బండ్లకు ప్రా ధాన్యత ఇవ్వడం సరిత వర్గీయులలో ఆందోళనకు గురి చేసింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బలం నిరూపించుకోవాలని సంకల్పంతో ఉ న్న సరిత వర్గీయులకు ఎమ్మెల్యే బండ్ల రా కతో ఇబ్బందిగా మారింది.

ఇప్పటికే పార్టీలో తగిన ప్రాధాన్యత లేక ఒంటరి పోరాటం చే స్తున్న సరితకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గీయులకు పార్టీ భీ ఫారాలు అందజేస్తుందా లేదా అనేది ప్రశ్నగా మా రింది. ఒక వేళ గద్వాల ఎమ్మెల్యే బండ్లకు కాంగ్రెస్ పార్టీ భీపారాలు అందజేస్తే సరిత వర్గీయుల పరిస్థితి ఏమిటని, పార్టీలో ఉండి సైలెంట్ గా ఉండటమా లేదా మరో పార్టీ వై పు చూడటం అని చర్చించుకుంటున్నారు. ఇ ప్పటికే సరిత వర్గీయులలో కొందరు మరో పార్టీల నేతలకు టచ్ లోకి వెళ్లనట్లు, మరికొందరు రెబెల్‌గా పోటీ చేసేందుకు సిద్దమై నట్లు తెలుస్తోంది. ఏది ఏమైన ఈ ఎన్నికల తో నియోజకవర్గ ఇంచార్జీ సరిత భవిత్యం తే లనున్నది. భవిష్యత్ రాజకీయాల కోసం కాంగ్రెస్ నేత సరిత గట్టి నిర్ణయమే తీసుకోనున్నట్లు ఆమె వర్గీయులు బహిరంగానే చెప్పుకుంటున్నారు.