28-08-2025 05:59:36 PM
నకిరేకల్ (విజయక్రాంతి): గ్రామాలలో నెలకొన్న స్థానిక సంస్థలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో ఇంటింటి సిపిఎం సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో అనేక ప్రజా సమస్యలు వెలుగులోకి వచ్చేయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, మండల కమిటీ సభ్యులు కొప్పుల అంజయ్య జిల్లా ఉపేందర్ గ్రామ శాఖ కార్యదర్శి షాబాద్ బిక్షం రెడ్డి శాఖ సభ్యులు గంటా అంజయ్య జిల్లా రాములు గంగుల కిష్టయ్య రామస్వామి తదితరులు పాల్గొన్నారు.