08-05-2025 12:00:00 AM
ఎల్బీనగర్, మే 7: ఉగ్రవాదుల పహల్గా మ్ దాడికి కౌంటర్ గా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధు విజయవంతం కావ డంతో ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు. సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ ఆ ధ్వర్యంలో పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సం బరాలు నిర్వహించారు. ఎల్బీనగర్ చౌరస్తా మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పు ల నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు హరీశ్ రెడ్డి, నాంపల్లి రామేశ్వర్,రంగారెడ్డి, యంజల్ జగన్, శ్రీధర్ గౌడ్, కిరణ్, మాధవి, విజయ్ శ్రీ,,ముత్యం రెడ్డి, కడారి యాదగిరి, రాఘవేందర్, కిరణ్ రెడ్డి, అనిల్, ధర్మేందర్, మధుకర్, మహేశ్, జయ తేజ, ఎల్లారెడ్డి, నవీన్ షా, శేఖర్ పాల్గొన్నారు. కొత్తపేటలో కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.